
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్:- రైలు ప్రయాణంలో ఒక మహిళపై దారుణం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్, గుంటూరు నుండి చర్లపల్లి వైపు వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ మహిళపై దుండగుడు అత్యాచారం చేసి, ఆపై ఆమె హ్యాండ్‌బ్యాగ్ లాక్కొని పరారయ్యాడు. బాధితురాలు ఒంటరిగా రైల్లో ప్రయాణిస్తుండగా నిందితుడు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. రైలు మధ్యరాత్రి పెద్దకూరపాడు, నల్లపాడు మధ్యలో నడుస్తున్న సమయంలో, మహిళను కత్తితో బెదిరించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత ఆమె బ్యాగ్‌లోని డబ్బు, మొబైల్ ఫోన్, బంగారు ఆభరణాలు లాక్కొని రైలు పెద్దకూరపాడు రైల్వే స్టేషన్ వద్ద దిగిపోయి పరారయ్యాడు.
Read also : ఆయన కడుపున పుట్టడం జన్మజన్మల అదృష్టం.. కానీ ఆ విషయంలో మాత్రం..?
షాక్‌లో ఉన్న బాధితురాలు చర్లపల్లి రైల్వే స్టేషన్ చేరుకున్న వెంటనే చర్లపల్లి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు నిందితుడి కోసం గాలింపు ప్రారంభించారు. రైల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీ, టికెట్ వివరాలు ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో రైలు భద్రతపై మళ్లీ ప్రశ్నలు తలెత్తాయి. పోలీసులు ప్రయాణికులకు హెచ్చరిక జారీ చేస్తూ, రాత్రి ప్రయాణాల సమయంలో అపరిచితులతో మాట్లాడకూడదని సూచించారు.
Read also : దారుణంగా పడిపోతున్న ఐపీఎల్ విలువ.. కారణమేంటంటే?