
-
గడ్డిమందు తాగిన బాధితురాలు, పరిస్థితి విషమం
-
నిందితుడు రమేష్‌పై చర్యలకు డిమాండ్
క్రైమ్ మిర్రర్, హన్మకొండ : తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన హన్మకొండ జిల్లాలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే… భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో గుడికందుల రమేష్ ఓ మహిళ వద్ద నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. కొంత సమయం పెట్టి ఆలోపు తిరిగి ఇస్తానని నమ్మించాడు. ఆరునెలలు గడుస్తున్నా సదరు మహిళకు డబ్బులు ఇవ్వకపోగా, ఇంటి చుట్టూ తిప్పించుకుంటున్నాడు.
దీంతో ఆ బాధితురాలు తీవ్ర మనోవేధనకు గురైంది. ఇక తన డబ్బులు రావేమోనన్న బాధతో రమేష్ ఇంటి ఎదుటే గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి సీరియస్‌గా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అప్పు ఇచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకుందని ఆ మహిళపై పలువురు సానుభూతి తెలుపుతున్నారు. అప్పు తీసుకునేవారు సకాలంలో చెల్లించకపోవడంతో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి చదవండి: