క్రైమ్ మిర్రర్,రంగారెడ్డి:- మాడ్గుల మండలం అప్పారెడ్డిపల్లి గ్రామంలో ఈనెల 27 నుండి నిర్వహించే లక్ష్మీ నర్సిహ్మ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా అప్పారెడ్డిపల్లి గ్రామం నుండి నాగిల్ల రోడ్ వరకు ఇరు వైపులా చెట్లను తొలగించి రోడ్డు పై మట్టి పోయడానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హామీ ఇచ్చిన నేపథ్యంలో మంగళవారం దేవాలయ ప్రాంగణం వద్ద సర్పంచ్ కాస సత్యనారాయణ పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా తాజా మాజీ జెడ్పిటిసి గౌరారం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గుంతల మయమైన రోడ్డుపై మరమ్మతు పనులకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకరించడం పట్ల గ్రామ సర్పంచ్, పాలకవర్గం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు.
ఈ బ్రహ్మోత్సవాలను రాజకీయాల కతీతంగా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని గౌరవరం ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డిలు కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉడుతల రజిత యాదయ్య గౌడ్, వార్డ్ మెంబర్లు తోట వెంకటయ్య యాదవ్, నాగిళ్ళ మహబూబ్ ,కాసోజు విష్ణువర్ధనా చారి, పల్లిటి రమేష్, ముక్కరి శివలిల శ్రీశైలం, కురిమిద్య సునిత ముత్యాలు, బద్రీ,సెక్రెటరీ వినోద్, మాజీ సర్పంచ్ పల్లెటి జంగమ్మ యాదయ్య, మాజీ వార్డు సభ్యులు కాస జంగయ్య, గ్రామస్తులు కాసోజు బ్రహ్మచారి, కంకణాల కొండల్ రెడ్డి డేరంగుల కృష్ణయ్య ,కాస శ్రీను, జెసిబి మహేష్,కాస లింగం, నాగిళ్ళ శ్రీరాములు పల్లేటి జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

