తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఏడాది కూడా సంక్రాంతి సమయంలో చలి అనేది విపరీతంగా పెరుగుతుంది. కాకపోతే ఈ ఏడాది కొద్దిరోజులు ముందుగానే తక్కువ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో సాధారణం కంటే మూడు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వాళ్ళు వెల్లడించారు. మరికొన్ని జిల్లాల్లో అయితే ఏకంగా సింగిల్ డిజిట్లో ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయని IMD తాజాగా పేర్కొంది.
ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయంతోనే వణికిపోతున్నారని చెప్తున్నారు. సిర్పూర్ లో 5.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ప్రస్తుతం హైదరాబాద్లో 11.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో విపరీతంగా చలి కారణంగా ప్రజలు ఇళ్లలోనే ఉండాల్సి వస్తుంది. అయితే ఇంతలోనే వాతావరణ శాఖ మరో హెచ్చరికలు జారీ చేసింది. అదేంటంటే రాబోయే రెండు రోజులు పాటు కూడా ఇంకా ఉష్ణోగ్రతలు తగ్గిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయని దానివల్ల చలి తీవ్రత అనేది మరింత పెరుగుతుందని తెలిపారు.
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్!.. ఇండియా దే హవా?
ప్రతి ఒక్కరు కూడా రాబోయే రెండు రోజులు పాటు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఉదయాన్నే ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని IMD హెచ్చరికలు సూచించింది. ఇప్పటికే పనులు నిమిత్తం చాలామంది కూడా చలి తీవ్రత కారణంగా బయటకి వెళ్లలేకపోతున్నారు. ఈ సంక్రాంతి వరకు ఇలానే చలి తీవ్రత అనేది ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు.