
మాదాపూర్, క్రైమ్ మిర్రర్:- గుట్టల బేగంపేట్ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ గణేష్ వారి ఆధ్వర్యంలో కొలువైన గణనాధుని వద్ద నిత్య పూజలు అందుకున్న లడ్డూ ప్రసాదం ల వేలం పాటలు పోటా పోటీగా నడిచాయి. స్వామి వారి మొదటి లడ్డూ ఈరణ్ సురేష్ 51000/- రూపాయలు ల కు ఈరన్ సురేష్ దక్కించుకున్నారు. ఈ సందర్భంగా గుట్టల బేగంపేట్ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల మహెూత్సవం ను ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలియ జేశారు.
స్వామి వారి లడ్డూ ప్రసాదం ను దక్కించుకున్న వారికి వారి కుటుంబ సభ్యులకు విఘ్నాలు తొలగించి విజయాలు సాధించేలా స్వామీ వారి కృపా కటాక్షముల ఉండాలని ఆకాంక్షించారు. వారికి శాలువా లతో సత్కరించి అభినందనలు తెలిపారు. వేలంపాట పాడి లడ్డు తీసుకున్నారు. వారిని కమిటీ సభ్యులు శాలువా తో సత్కరించి, స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళల వారి కుటుంబ సభ్యులకు ఉండాలి అని ఆకాంక్షించారు. అనంతరం గణేష్ నిమజ్జనాల ఉత్సవాలు కూడా ఘనంగా జరిపించారు.
Read also : ప్రశాంతంగా ముగిసిన నిమజ్జనాలు.. అన్ని శాఖల సిబ్బందికి CM ప్రత్యేక అభినందన!