
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:-
మావోయిస్టులలో అగ్రనేత అయినటువంటి హిడ్మా ఎన్కౌంటర్ ను నిరసిస్తూ నేడు మావోయిస్టు పార్టీ భారత్ బందుకు పిలుపునిచ్చింది. అనారోగ్యం కారణంగా చికిత్స కోసం విజయవాడ వైపు వచ్చినటువంటి హిడ్మాను పోలీసులు పట్టుకొని కాల్చి చంపడం పట్ల మావోయిస్టు పార్టీ తీవ్రంగా మండిపడింది. ఇప్పటికే చాలామంది మావోయిస్టులు లొంగిపోతుంటే మరి కొంతమంది మాత్రం లొంగిపోయే ప్రసక్తి లేదు అంటూ చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. నేడు దేశవ్యాప్తంగా బందుకు పిలుపునిచ్చిన మావోయిస్టులను చూసి AOB లో పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. తక్షణమే విశాఖపట్నం నుంచి సీలేరు మీదుగా భద్రాచలం వరకు ప్రయాణించేటువంటి బస్సులను వెంటనే రద్దు చేశారు. ఇక ఈరోజే ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా అన్ని మైదాన ప్రాంతాలు అలాగే ప్రముఖ నగరాలలో మరియు గ్రామాలలో బంద్ ప్రభావం అనేది పెద్దగా ఉండకపోవచ్చు. కానీ మావోయిస్టులు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత చాలా ఆగ్రహం మీద ఉన్నారు. కాబట్టి వారు ఏదైనా చేసే అవకాశాలు కనిపిస్తూ ఉండడంతో పోలీసులు వివిధ ప్రాంతాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను ఆరాధిస్తూ ఉన్నారు. కాగా మావోయిస్టులో కీలక పాత్రుడైనటువంటి హిడ్మా ఎన్కౌంటర్ రోజునే చాలామంది మావోయిస్టులు లొంగిపోయారు. హిడ్మా ఎన్కౌంటర్ లో చనిపోయిన తర్వాత వారి గ్రామం మొత్తం కూడా కన్నీటి పర్యంతమైంది. మరోవైపు హోం మంత్రి అమిత్ షా తో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం మావోయిజం లేకుండా చేయాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసింది.
Read also : అల్పపీడనం ఎఫెక్ట్… ఈ నెల 30న మరో తుఫాన్!
Read also : గ్లోబల్ సమ్మిట్ తో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరగాలి : సీఎం





