
బాలాపూర్ (క్రైమ్ మిర్రర్) : బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల డిగ్రీ కాలేజీలో జరిగిన వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న టిపిసిసి ప్రధాన కార్యదర్శి మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి. ఈ సందర్భంగా పారిజాత నరసింహారెడ్డి మాట్లాడుతూ కళాశాలలో మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ నూతనంగా వచ్చే సంవత్సరం రానున్న విద్యార్థులకు స్వాగతం పలికారు.
మనం ఎక్కడ చదువుతున్నాం అన్నది కాకుండా ఏ విధంగా చదువుతున్నామనేది ముఖ్యమని, విద్యార్థులు మంచి మార్కులు పొందడానికి కృషి చేయాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న కాలేజీ అటు పాలిటెక్నిక్ మరియు డిగ్రీ విద్యార్థులకు సరిపోవడం లేదని వీలైన మేరకు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి డిగ్రీ కాలేజీ సిబ్బందికి, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూసేందుకు కృషి చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి, పెద్దబావి ఆనంద్ రెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రో. సీహెచ్ ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ డా. రాజ్ కుమార్, అధ్యాపకులు డా. సిహెచ్ వెంకట్ రెడ్డి, డా. రేవతి, డా. జ్యోతి, నరసింహ రాజు, డా. రామరాజు, డా. కిరణ్మయి, నర్సింహ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.