
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- నేడు భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య మూడవ టి20 మ్యాచ్ జరుగునుంది. ఈ మ్యాచ్ లో భారత్ గెలవాలి అని ఫ్యాన్స్ అయితే దేవాలయాలకు వెళ్లి మరీ మొక్కుంటున్నారు. ఆస్ట్రేలియాలోని ఓవల్ వేదికగా నేడు మూడవ టి20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే రెండు టీ20 మ్యాచ్లు జరగగా ఫస్ట్ టి20 మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయి రద్దయింది. ఇక రెండో మ్యాచ్లో భారత్ ఘోర పరాజయాన్ని పొందింది. దీంతో మూడవ టి20 లో ఎలాగైనా గెలిచి విజయం సాధిఛి ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ తెప్పించే ఆలోచనలలో ఇండియా ఉంది. భారత స్టార్ బ్యాట్స్ మెన్స్ సూర్య కుమార్ యాదవ్ మరియు గిల్ మంచి గాడిలో పడి ఆడాలి అని సూచిస్తున్నారు. మరోవైపు ఆస్ట్రేలియా నుంచి స్టార్ బౌలర్ హజల్ వుడ్ ఈ మ్యాచ్ కు దూరం కావడంతో భారత్ కి మ్యాచ్ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు ఇండియన్ బౌలర్ హర్షిదీప్ ఈ మ్యాచ్ లో ఆడుతారా?.. లేదా?..అనేది ఉత్కంఠంగా మారింది. ఒకవేళ ఈరోజు కూడా టీమిండియా ఓడిపోయింది అంటే మిగతా రెండు మ్యాచ్లలో పక్క గెలవాల్సి ఉంటుంది. ఈరోజు గెలిస్తే ఇద్దరూ చెరో మ్యాచ్ గెలిచిన వారు అవుతారు. ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా టి20 సిరీస్ అయినా గెలిచి ఆస్ట్రేలియాకు కౌంటర్ ఇవ్వాలని చూస్తుంది. మరి ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనేది కామెంట్ చేయండి.
Read also : మరో మూడు రోజులపాటు ఏపీకి పొంచి ఉన్న వర్షపు ముప్పు!
Read also : జోగి రమేష్ అరెస్ట్ అవుతారా..?





