
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఎంతగా పెరిగింది అనేది కొన్ని సంఘటనలు చూస్తుంటే తెలిసిపోతుంది. తాజాగా యూరియా కోసం వెళ్లిన ఒక రైతును పోలీస్ చెంపపై కొట్టడంతో అక్కడున్నటువంటి రైతులందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా అడిగితేనే కొట్టేస్తారా?.. అధికారం ఇచ్చింది ఇందుకేనా అని పక్కనున్నటువంటి వారందరూ పోలీసులను నిలదీసి ప్రశ్నించారు. అసలు ఏం జరిగిందంటే.. తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా, తీలేరులో ఈ సంఘటన చోటు చేసుకుంది. రైతులందరూ కూడా యూరియా కోసం ఉదయాన్నే స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి భారీగా తరలివచ్చారు. ఎక్కువ మంది రైతులు రావడంతో అక్కడ కాస్త గందరగోళం అనేది ఏర్పడింది. ఈ క్రమంలోనే పోలీసులు వారందరినీ కూడా ఆపే ప్రయత్నంలో ఒక పోలీస్ అధికారి యువ రైతుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెంపపై చెల్లుమని కొట్టారు. దీంతో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. యూరియా కోసం ఉదయం నుంచి ఇక్కడే గంటల తరబడి నిలబడి వేచి చూస్తుంటే… మీరు అధికారం ఉందని ఇష్టమొచ్చినట్టు యువ రైతును అందరి ముందు కొడతారా అంటూ నిలదీశారు. సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే ఈ పోలీసు అధికారిపై చాలానే మండిపాటు కామెంట్లు వస్తున్నాయి.
Read also :రుషికొండ ప్యాలెస్… పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు!
తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోరుబాటు కార్యక్రమం చేపట్టారు. కేటీఆర్, హరీష్ రావు, సబితా రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు అందరూ కూడా పాదయాత్ర చేసుకుంటూ అగ్రికల్చర్ కమిషనరేట్ కు బయలుదేరారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ.. ప్లకార్డులు పట్టుకొని నడుచుకుంటూ వెళ్లి కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. బీజేపీ అలాగే కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా దొంగ నాటకాలు వేస్తున్నాయని హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు వెంటనే తగిన యూరియా అందించాలని డిమాండ్ చేశారు.
Read also : టాలీవుడ్ లో తన ఫేవరెట్ హీరో ఎవరో చెప్పేసిన విరాట్ కోహ్లీ!