
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతో నేటి నుంచి శనివారం రోజు వరకు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో నేడు కూడా వర్షాలు దంచి కొట్టనున్నాయి. అలాగే ఈనెల చివరి వారంలో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. కాగా ఇప్పటికే గత రెండు నెలల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు ప్రతిరోజు కూడా కురుస్తూనే ఉన్నాయి. ఈ వర్షాలకు ఎంతో మంది ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైతులు పంట ద్వారా నష్టపోతున్నారు. వాహనదారులు వర్షాల కారణంగా తెగ ఇబ్బందులు పడుతున్నారు. ఇక నేటి నుంచి ఐదవ తేదీ వరకు కూడా వర్షాలు పడుతాయి అని.. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఏపీలో నేడు వర్షాలు పడే జిల్లాలు
1. శ్రీకాకుళం
2 అల్లూరి
3. విశాఖపట్నం
4. ఎన్టీఆర్
5. కృష్ణ
నేడు ఈ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే నిర్ణయించారు.
తెలంగాణలో నేడు వర్షాలు పడే జిల్లాలు
1. నిజామాబాద్
2. సిరిసిల్ల
3. కరీంనగర్
4. కొత్తగూడెం
5. ఖమ్మం
6. నల్గొండ
7. సూర్యాపేట
8. సిద్దిపేట
9. భువనగిరి
10. రంగారెడ్డి
11. హైదరాబాద్
12. మేడ్చల్
13. ఉమ్మడి అదిలాబాద్
14. వరంగల్
ఈ 14 జిల్లాలలో నేడు భారీ వర్షాలు పడుతాయని.. ఈ జిల్లాలో అన్నిటికీ కూడా వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.
Read also : మహేశ్వరం ప్రధాన రహదారిలో పొంచి ఉన్న ప్రమాదం