Tuesday, February 24, 2026
Homeక్రీడలుభారీ ఓటమి తర్వాత జట్టులో మార్పులు ఉంటాయా..?

భారీ ఓటమి తర్వాత జట్టులో మార్పులు ఉంటాయా..?

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- టి20 వరల్డ్ కప్ లో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న సూపర్ -8 లో మొదటి మ్యాచ్ లోనే భారత్ ఘోర ఓటమి చవి చూసింది. వరస విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టు దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయం పొందిన తర్వాత యావత్ ఫ్యాన్స్ అందరూ కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా జట్టులో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా అనే సందిగ్ధం నెలకొంది. ఈ విషయంపై తాజాగా క్రీడా వర్గాలు సైతం ఒక క్లారిటీ అయితే ఇచ్చాయి. వరుసగా ప్రతి మ్యాచ్ లోను విఫలమవుతున్నటువంటి అభిషేక్ శర్మ మరియు తిలక్ వర్మ ఇద్దరిలో ఒకరిని తప్పించి సంజు సాంసన్ కు అవకాశం ఇస్తారు అని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర పటేల్ ని తీసుకువచ్చి స్పిన్ విభాగంలోనూ బలంగా ఉండే విధంగా మార్పులు చేయనున్నారు. మరోవైపు బౌలింగ్ విభాగంలోని కొన్ని చేంజెస్ ఉండొచ్చు అని క్రీడా వర్గాలు తెలిపాయి. భారత్ సెమిస్ కు చేరాలంటే తర్వాత జరగబోయేటువంటి జింబాబ్వే అలాగే వెస్టిండీస్ పై ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. కాబట్టి ప్రతి మ్యాచ్ లోను రన్ రేట్ కూడా ముఖ్యంగా భావించాలి. అప్పుడే సెమీస్ కు చేరుకోగలుగుతాము. ఏ మ్యాచ్ ను ఈజీగా తీసుకోవద్దు అని టీమిండియా జట్టుకు ఫాన్స్ సైతం సూచనలు చేస్తన్నారు.

Nana Patekar: కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్ వదిలేసి పల్లెటూరిలో ఉంటున్న హీరో.. ఎందుకో తెలుసా?

రేపు పరీక్ష రాసే ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments