
కాంగ్రెస్ అంటేనే కుమ్ములాటలు, అంతర్‌యుద్ధాలు… పదవుల కోసం పోట్లాటలు, కుర్చీల కోసం కుస్తీలు. ఇప్పటికీ పార్టీ పరిస్థితి అలాగే ఉంది. తెలంగాణలో పదేళ్ల తర్వాత… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సీనియర్ నాయకులను దాటుకుని.. రాహుల్ గాంధీ అండతో రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ.. పదవి చేపట్టినప్పటి నుంచి ఆయన ముందు ఎన్నో సవాళ్లు. వాటిలో ముఖ్యమైంది.. పార్టీలో నేతల మధ్య సయోధ్య, సమన్వయం. ఇటీవల కొందరు నేతలు సీఎం రేవంత్‌రెడ్డిపై, పార్టీలో పరిస్థితిపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలే.. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది… పైగా నేతల అసంతృప్తి.. ఇవన్నీ… పార్టీని చిక్కుల్లో పడేస్తాయన్న ఆందోళన నెలకొంది తెలంగాణ కాంగ్రెస్‌లో. ఈ పరిస్థితిలో.. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా ఉన్న దీపా దాస్ మున్షీని తప్పించి.. ఆమె స్థానంలో మీనాక్షి నటరాజన్‌ను నియమించింది AICC.
మీనాక్షి నటరాజన్… చూసేందుకు చాలా అంటే చాలా సింపుల్‌గా ఉంటారు. అంత పెద్ద నాయకురాలుగా ఉన్న ఆమె… సాధారణ మహిళగా కనిపిస్తారు. ఎక్కడా ఆడంబరాలకు పోరు. ఢిల్లీ నుంచి తెలంగాణకు రైలులో వచ్చారంటేనే.. ఆమె సింప్లిసిటీ అర్థం చేసుకోవచ్చు. సింపిల్‌గా ఉండటమే కాదు… పార్టీలో సమస్యలను పసిగట్టి.. చిటికెలో పరిష్కారం చూపగల సమర్థురాలు కూడా. అందుకే AICC ఆమెను తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా నియమించింది.
నాయకురాలు వస్తుంటే.. పార్టీ నేతలంతా కాకా పట్టే పనిలో ముందుంటారు. మీనాక్షి నటరాజన్ కోసం రైల్వేస్టేషన్‌కు క్యూకట్టారు నేతలు. ఆమె మెప్పు పొందాలని చూశారు. కానీ.. అలాంటి స్వాగతాలకు…. తాను తావు ఇవ్వనని ఒక్క మాటలో చెప్పేసింది మీనాక్షి నటరాజన్. తన కోసం ఎవరూ రైల్వేస్టేషన్లకు రావొద్దని, తన బ్యాగులు మోయొద్దని క్లారిటీ ఇచ్చేసింది. నాయకులు ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు పెడితే ఎన్నికల్లో గెలవరని.. ప్రజల్లో ఉండాలని హితబోద చేశారామె. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని చెప్పారు. ఏ కార్యకర్త ఫోన్ చేసినా తాను రిసీవ్ చేసుకుంటానని అన్నారు. ఆమె మాటలు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపినట్టు అయ్యింది. సీఎం రేవంత్‌రెడ్డి కూడా… మీనాక్షి నటరాజన్ రాకతో కార్యకర్తలకు మంచి రోజులు వచ్చాయని చెప్పారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మార్పు వస్తుందని.. నాయకుల మధ్య సయోధ్య కుదురుతుందని.. అందరూ కలిసి పనిచేసే రోజులు వస్తాయని… ఆశిస్తున్నారు.
ఇవి కూడా చదవండి…
-
సీఎం రేవంత్‌రెడ్డి.. కిషన్‌రెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..? – దీని వెనకున్న పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి..?
-
విషాదమును మిగిల్చిన SLBC టన్నెల్ సంఘటన.. 8 మంది కార్మికులు మృతి!..
-
ఫ్రీ కరెంట్ స్కీం బంద్? వినియోగదారుల్లో టెన్షన్
-
చనిపోయిన కోళ్లను చెరువు కట్టపై పడేసిన దుండగులు..
-
పోసాని తర్వాత టార్గెట్ ఆయననే..? సజ్జల, ఆయన కుమారుడు భార్గవ్ అరెస్ట్ తప్పదా..?