తెలంగాణ

టాప్ హీరో బెడ్ రూంలోకి వెళ్లి అరెస్ట్ చేస్తారా.. రేవంత్‌పై బీజేపీ నేతల ఫైర్

సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు బీజేపీ నేతలు. అల్లు అర్జున్ అరెస్టును ఖండిస్తూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ అరెస్టు ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు సంబంధిత అధికారులకు ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ.. అరెస్టు చేయడం ఉద్దేశపూర్వకమేనని అర్థమవుతోందని తెలిపారు. కార్యక్రమ వేదిక వద్ద భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే అన్నారు. కానీ అది చేయకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో సినీ నటులను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారనేది మరోసారి నిరూపితమైందన్నారు.ఈ అరెస్టును, పాలకుల అధికార దుర్వినియోగాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ట్వీట్ చేశారు కిషన్ రెడ్డి.

సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో మహిళ మరణించడం దురదృష్టకరం అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. పుష్ప ది రూల్‌ సినిమాపై అభిమానుల్లో భారీ అంచాలనున్నయన్న విషయం ప్రభుత్వానికి ముందే తెలుసన్నారు. ఆ జనాదరణను బట్టి సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. జాతీయ అవార్డు గ్రహీత అయిన అల్లు అర్జున్‌కు కనీసం బట్టలు మార్చుకునే సమయం కూడా ఇవ్వకుండా.. తన బెడ్‌రూమ్‌లోకి ప్రవేశించి అతన్ని తీసుకురావడం అవమానకరమైనదని బండి సంజయ్ అన్నారు. భారతీయ సినిమాకు ప్రపంచ గుర్తింపు తెచ్చిన అల్లు అర్జున్‌ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు సరైనది కాదన్నారు సంజయ్.

అల్లు అర్జున్ కు సపోర్ట్ గా నిలిచాడు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ తప్పేమిలేదని ట్వీట్ చేశాడు. సంఘటనలో పోలీస్ శాఖ యొక్క వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అల్లు అర్జున్ తన విజయాలతో తెలుగు రాష్ట్రాలకు ఎనలేని గర్వం చెచ్చాడన్నారు. తాను చేయని తప్పుకు తనని అరెస్ట్ చేయడం అన్యాయం అన్నారు. క్రౌడ్ మేనేజ్‌మెంట్‌లోని సమస్యలు, లోపాలను పరిష్కరించడానికి బదులుగా.. ప్రముఖ సినీ సెలబ్రిటీలను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదన్నారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. జవాబుదారీతనం నిజంగా ఎక్కడ ఉందో – ప్రజా భద్రతను కాపాడే బాధ్యత కలిగిన వారితో నిర్ధారించుకోవాలన్నారు. అల్లు అర్జున్ కు గౌరవం ఇవ్వాలని.. తనని ఒక క్రిమినల్ లాగా చూడొద్దని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button