
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- కొంతమంది వల్లభ వాణిజ్య ప్రయోజనాల కోసం చిరంజీవి పేరును అలాగే ఫోటోలను ఉపయోగిస్తున్నారు అని చిరంజీవి ఇటీవల హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు చిరంజీవికి అనుకూలంగానే తీర్పునిచ్చింది. కొంతమంది టీఆర్పీలు, లాభాల కోసం చిరంజీవి పేరును దుర్వినియోగం చేస్తున్నారని అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం పోలీసులకు ఎంతైనా ఉంది అని ఆదేశాలు జారీ చేశారు. అనుమతి లేకుండా చిరంజీవి పేరు, ఫోటోలు, వాయిస్ లేదా చిత్రాలను కానీ వాణిజ్య ప్రయోజనాలు లేదా సొంత వ్యాపార లాభాల కోసం ఉపయోగిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో కోర్ట్ దాదాపు 30 మందికి పైగా నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. టీవీ ఛానళ్లు, డిజిటల్, మీడియా సంస్థలు ఇలా అన్నిటికీ ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొన్నారు. ఎవరి వల్లనైనా సరే చిరంజీవి ప్రతిష్ట దెబ్బతింటే మాత్రం ఖచ్చితంగా వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Read also : వర్ష బీభత్సం… తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని జిల్లాలకు హెచ్చరికలు!
Read also : రష్మికాను ఆట పట్టించిన అల్లు అరవింద్..!





