
కొడాలి నాని అరెస్ట్ తప్పదా..? ఆరోగ్యం బాగోలేదన్న సంకేతాలు ఇస్తున్నా.. పోలీసులు పట్టించుకునే పరిస్థితిలో లేరా…? నేడో, రేపో… కొడాలి కటకటాల వెనక్కి వెళ్లక తప్పదా…? పరిణాలమాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది.
కొడాలి నాని.. వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్నారు. టీడీపీపై, చంద్రబాబుపై, లోకేష్‌పై… అసభ్యకరంగా మాట్లాడిన నేతల్లో కొడాలి ఒకరు. లోకేష్ రెడ్‌బుక్‌లో వల్లభనేని వంశీ తర్వాత పేరు కొడాలి నానిదే ఉందని సమాచారం. వంశీ తర్వాత అరెస్ట్ కొడాలిదే అన్న ప్రచారం కూడా జరిగింది. అయితే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా… ఇప్పుటి వరకు కొడాలిని అరెస్ట్ చేయలేదు. అందుకు కారణం.. ఆయన అనారోగ్యం. ఇటీవల గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు కొడాలి నాని. ఆయనకు బైపాస్ సర్టరీ కూడా జరిగింది. దీంతో.. ఆయన అరెస్ట్ ఆలస్యమైందని సమచారాం. అయితే.. ఈ మధ్య ఆయన అమెరికా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారని పోలీసులకు ఉప్పందింది. దీంతో.. ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇంతలో ఇంకో ట్విస్ట్. ఒక పెళ్లి వేడుకలో ప్రత్యక్షమయ్యారు కొడాలి నాని. ఆ సమయంలో కాస్త ఆరోగ్యంగానే కనిపించారని అందరూ అనుకున్నారు. వైసీపీ నేతలు కూడా కొడాలిని కలిసే ప్రయత్నం చేశారు. కానీ.. కొడాలి నాని ఎవరినీ కలవడంలేదని సమాచారం. అందరినీ కలిస్తే.. ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు సూచించారని తెలుస్తోంది.
మరోవైపు… పెళ్లిలో కొడాలి నాని ఆరోగ్యంగా కనిపించారన్న వార్త వైరల్ కావడంతో… ఆయన వర్గం క్లారిటీ ఇస్తోంది. ప్రస్తుతం కొడాలి నాని విశ్రాంతి తీసుకోవాలని… స్నేహితుడి ఇంట్లో పెళ్లి వెళ్లాల్సి రావడంతో తప్పక వెళ్లారని చెప్తున్నారు. అంతేకాదు.. మరో రెండు నెలల్లో ఆయన అందుబాటులోకి వస్తారని సంక్షేతాలు పంపారు కొడాలి నాని వర్గీయులు. అంటే.. రెండు నెలలు ఆయన అందులోబాటులో ఉండరు అని అర్థం. కానీ… పోలీసుల వ్యూహం మరోలా ఉన్నట్టు కనిపిస్తోంది. ఆయన్ను… ఏ నిమిషలో అయినా అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.
వంశీ తర్వాత అరెస్ట్ కావాల్సిందే కొడాలి నానినే అని.. కానీ… అనారోగ్యం కారణంగా తప్పించుకున్నారని అంటున్నారు టీడీపీ వర్గీయులు. కొడాలి నానిని వదిలిపెట్టొద్దని అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారట. ఈ క్రమంలో… త్వరలోనే కొడాలి నాని ఉండొచ్చన్న సంక్షేతాలు వస్తున్నాయి.