
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత జోగి రమేష్ అరెస్టు అవుతారని ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్ ఇంటికి సిట్ మరియు ఎక్సైజ్ అధికారులు వెళ్లారు. ఇవాళ ఉదయం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి అధికారులు చేరుకొని పలు వివరాలను సేకరిస్తున్నారు. ఆయనతోపాటుగా తన సోదరుడైనటువంటి రాముని కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి అని మీడియా వర్గాలు పేర్కొన్నాయి. జోగి రమేష్ అండతోనే నకిలీ మద్యం విక్రయాలు జరిగాయి అని ఈమధ్య సోషల్ మీడియాలో బాగానే వార్తలు వైరాలయ్యాయి. కాగా ఈ కేసులో ఏ-1 గా జనార్దన్ రావు వాంగ్మూలం ఇచ్చిన విషయం కొద్దిరోజుల క్రితం సంచలనంగా మారింది. దీంతో నిజంగానే జోగి రమేష్ అరెస్ట్ అవుతారా? లేదా?.. అనేది ఒకవైపు ప్రజల్లోనూ మరోవైపు వైసీపీ నేతలలోనూ ఉత్కంఠంగా మారింది. మరి ఈ విషయంపై కొద్దిసేపట్లో ఖచ్చితమైన సమాచారం వచ్చే అవకాశం ఉంది.
Read also : వైసీపీ ఒక ఫేక్ పార్టీ.. ఎప్పుడు చూసినా శవరాజకీయాలే : సీఎం చంద్రబాబు
Read also : శ్రీకాకుళం తొక్కిసలాట పై స్పందించిన జగన్.. మళ్ళీ చంద్రబాబుదే తప్పు!





