తెలంగాణరంగారెడ్డిహైదరాబాద్

చార్మీనార్‌ను కూల్చేస్తారా.. హైడ్రాపై హైకోర్టు సీరియస్

హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు సీరియస్ అయింది. కూల్చివేతలపై చివాట్లు పెట్టింది. ఆదివారం రోజు ఎందుకు కూల్చివేతలు ఎందుకు చేశారో చెప్పాలని సూటిగా ప్రశ్నించింది హైకోర్టు. పత్రికలు చెప్పినట్లు వింటున్నారా లేక లా ఫాలో అవుతున్నారా? అని నిలదీసింది. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేతలు చేస్తున్నారో చెప్పాలని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించంది.

హైడ్రాకు ఉన్న చట్టబద్దత ఏంటో చెప్పాలని ఆదేశించింది హైకోర్టు. చట్టాన్ని ఉల్లగించి కూల్చివేత లు చేస్తున్నారన్న న్యాయస్థానం.. చార్మినార్ ను కూల్చాలని అక్కడి ఎమ్మార్వో చెబితే మీరు కూల్చేస్తారా అని హైడ్రా కమిషనర్ ను ఉతికి ఆరేసింది. తాము అడిగే ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది. జంప్ చేయకండని సూచించింది. అమీన్ పూర్ పై మాత్రమే మాట్లాడాలని హైడ్రా కమిషనర్ కు చురక అంటించింది హైకోర్టు. కావూరి హిల్స్ గురించి తాము అడగలేదని తెలిపింది.

Read More : హైకోర్టుకు హైడ్రా కమిషనర్.. కూల్చివేతలకు బ్రేక్!

 

Back to top button