
క్రైమ్ మిర్రర్, సోషల్ డెస్క్ :- మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఒక వింతైన విడాకుల కేసు వెలుగులోకి వచ్చి దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. తనను సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా తయారు చేయడానికి భర్త ఎంతో కష్టపడ్డాడని, అయితే తాను ఎస్ఐగా ఉద్యోగం పొందిన తర్వాత భర్త వేషధారణ, జీవనశైలి తనకు ఇబ్బందిగా మారిందని పేర్కొంటూ భార్య కుటుంబ కోర్టును ఆశ్రయించింది. కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. తన భర్త ధోతీ, కుర్తా ధరిస్తాడని, పోనీటైల్ పెంచుకుంటాడని, పూజారి వృత్తిని వదిలేయమని ఎన్నిసార్లు చెప్పినా అతను అంగీకరించలేదని పేర్కొంది. ఈ కారణాల వల్ల తనకు మానసిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అతనితో కలిసి జీవించడం సాధ్యం కావడం లేదని తెలిపింది. అందుకే విడాకులు కోరుతున్నట్లు కోర్టుకు వెల్లడించింది.
Read also : కోడి పందాలపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు
ఈ ఘటనలో గమనించాల్సిన అంశం ఏమిటంటే, భర్త సంప్రదాయ జీవన విధానాన్ని కొనసాగిస్తుండగా, భార్యకు పోలీస్ శాఖలో అధికార హోదా రావడంతో ఇద్దరి మధ్య ఆలోచనా భేదాలు తీవ్ర స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. సంప్రదాయం, వృత్తి స్వేచ్ఛ, వ్యక్తిగత ఇష్టాలు వివాహ బంధంలో ఎంతవరకు ప్రభావం చూపగలవన్న అంశంపై ఈ కేసు పెద్ద చర్చకు దారితీస్తోంది. ఈ కేసు ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణ దశలో ఉండగా, తుది తీర్పు ఎలా ఉండబోతుందన్న ఆసక్తి నెలకొంది. వ్యక్తిగత అభిరుచులు విడాకులకు కారణమవుతాయా? అన్న ప్రశ్నతో పాటు, ఆధునికత, సంప్రదాయం మధ్య సంఘర్షణకు ఈ కేసు ప్రతీకగా మారిందని న్యాయ, సామాజిక వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Read also : విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ





