
ఎల్బీనగర్, క్రైమ్ మిర్రర్ : ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఈరోజు ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అధ్యక్షత వహించారు.
సాగర్ రింగ్ రోడ్ చౌరస్తా సమీపంలోని వన్ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా పరిశీలకులు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేన రెడ్డి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో పార్టీ కీలక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. నియోజకవర్గ స్థాయిలో పార్టీకి మరింత బలం చేకూర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది.