
ఏపీలో ఎన్నికలు అయిపోయాయి.. కానీ ఆ రాజకీయ వేడి మాత్రం ఇంకా సెగలు కక్కుతూనే ఉంది. 2024 ఎన్నికల వేళ వైనాట్ కుప్పం అని వైసీపీ అంటే… వైనాట్ పులివెందుల అని టీడీపీ నినాదం ఎత్తుకుంది. అయితే.. వైసీపీకి ఘోర ఓటమి తప్పలేదు. జనసేన, బీజేపీతో కలిసి టీడీపీ ఘనవిజయం సాధించింది. వైఎస్ కుటుంబం కంచుకోట అయిన కడప జిల్లాలో కూడా పచ్చ జెండా రెపరెపలాడింది. ఉమ్మడి కడప జిల్లాలోని 10 స్థానాల్లో ఏడు స్థానాలను కూటమి విజయం సాధించింది. ఐదు స్థానాలు టీడీపీ సొంతం కాగా… బీజేపీ, జనసేన చెరో స్థానంలో గెలిచాయి. అయితే.. ఎంత ప్రయత్నించినా జగన్ అడ్డా పులివెందులను మాత్రం టచ్ చేయలేకపోయాయి కూటమి పార్టీలు. ఎన్నికలు అయిపోయాయి.. రాజకీయ వేడి చల్లబడిందని అందరూ అనుకున్నారు. కానీ.. టీడీపీ మాత్రం పులివెందులకు గురిపెట్టే ఉందట. వైనాట్ పులివెందుల స్ట్రాటజీతోనే ముందుకు వెళ్తోందట. అందుకు.. మహానాడును అస్త్రంగా వాడుకోబోతోందని సమాచారం.
ఈ ఏడాది (2025) మే 27, 28 తేదీల్లో రెండు రోజుల పాటు మహానాడు నిర్వహించాలని టీడీపీ భావిస్తోంది. ఈసారి మహానాడు ఎక్కడ నిర్వహిస్తే బాగుంటుందన్న చర్చ వచ్చినప్పుడు.. కడప అయితే బెస్ట్ అని పార్టీ నిర్ణయించినట్టు సమాచారం. దీంతో.. మహానాడు నిర్వహించేందుకు కడపలో రెండు, మూడు స్థలాలు కూడా చూసిపెట్టుకున్నారట. అయితే.. కడపలో కాకుండా పులివెందులలో మహానాడు పెడితే ఎలా ఉంటుందని టీడీపీ పెద్దలు ఆలోచనలో పడ్డారని సమాచారం. పులివెందులలో మహానాడును ఘనంగా నిర్వహిస్తే… రాయలసీమ పార్టీ కేడర్‌లో మరింత ఉత్సాహం నింపడమే కాకుండా… ఒక బలప్రదర్శనలా ఉంటుందనేది టీడీపీ ఆలోచన.
Also Read : లేడీ అఘోరీతో బీటెక్ యువతి జంప్… కామ వాంఛ తీర్చుకోలేదన్న శ్రీ వర్షిణి
ఎలాగైనా.. వైసీపీ అధినేత, వైఎస్ జగన్ అడ్డాలో పాగా వేయాలన్నది టీడీపీ ప్లాన్‌గా తెలుస్తోంది. ఇప్పటి నుంచే అందుకు వ్యూహరచన చేస్తోంది. ఆ వ్యూహాన్ని మహానాడుతో ముందుకు తీసుకెళ్లాలని తెలుగు దేశం పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. అయితే… మహానాడును కడపలో నిర్వహిస్తారా..? పులివెందులలో నిర్వహిస్తారా..? అన్నది టీడీపీ ఇంకా ఫైనల్ చేయలేదు. పులివెందులలో మహానాడు పెడితే మాత్రం… ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారుతుంది.