
మర్రిగూడ(క్రైమ్ మిర్రర్):-పిఎంసి నిధుల అవకతవకలు జరిగాయని,వెంటనే ఈ నిధులపై సమగ్ర విచారణ జరపాలని, ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం కారణంగానే నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి చెల్లం పాండు రంగారావు, మునుగోడు నియోజకవర్గ విద్యార్థి నాయకుడు సిలివేరు విష్ణు ప్రిన్సిపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.. మర్రిగూడ మండల కేంద్రంలోని శుక్రవారం మోడల్ స్కూల్ ను వారు సందర్శించారు.. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యా అభివృద్ధి కోసం, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో, అనేక నిధులను వెచ్చించి కాలిగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తూ, తోడుపాటును అందిస్తుంటే, ఇక్కడ మాత్రం నిధులు సక్రమంగా ఖర్చు చేయకుండా, బ్యాంక్ ఖాతా సాకుతో గత ఏడాది నిధులను వెనుకకు మల్లించారని ఆరోపించారు.. ఈ ఏడాది వచ్చిన నిధులను ఖర్చు చేయకుండా చోద్యం చూస్తున్న ప్రిన్సిపాల్ శివస్వరూప రాణిపై, విద్యాశాఖ ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
పాఠశాలలో తరగతి గధులకు కిటికీలు లేవని, విద్యార్థిని విద్యార్థులు టాయిలెట్ కి వెళ్లాలంటే, వెంటిలేషన్ లేకపోవడం, కోతుల భయంతో ఒకరికొకరు తోడు తీసుకపోయే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేసారు.. కేర్ టేకర్ లేకపోవడంతో విద్యార్థినులకు ఏదైనా సమస్య జరిగితే, బయటకు వచ్చి ఇతరుల సహాయంతో ఆసుపత్రికి వెళ్లే దౌర్బాగ్య పరిస్థితి మర్రిగూడ మోడల్ స్కూల్ లో దాపురించిందన్నారు.. మోడల్ స్కూల్ ప్రారంభించినప్పటి నుండి ప్రిన్సిపల్ మారినా విద్యార్థుల తల రాతలు మారడం లేదని, దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రిన్సిపాల్ వైపల్యామా..! లేక పర్యవేక్షించే విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యమా..! అంటూ వారు ప్రశ్నించారు..పాఠశాలలో వికలాంగులైన విద్యార్థిని విద్యార్థులు, ఉంటే వారిని ప్రోత్చాహిస్తూ అందరితో సమానంగా ఉండే విదంగా నిర్వహణ కార్యక్రమాలు శూన్యమని, మహిళా విద్యార్థినులను చైతన్య పరిచే కార్యక్రమాల ఉండవని, విద్యతో పాటు విద్యార్థిని విద్యార్థులకు వారి నైపుణ్యతను బట్టి నిర్వహించే క్రీడలు అంతత మాత్రమేనని, సాంస్కృతిక రంగం, డ్రాయింగ్ వంటివి ఇప్పటికి ప్రదర్శించిన దాకలాలు చూడలేదని, ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నత అధికారులు తక్షణమే విచారణ చర్యలు చేపట్టి, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మోడల్ స్కూల్ ను ఆదర్శ పాఠశాలని, చెప్పుకోవడానికే పరిమితం కాకుండా, విద్యార్థులకు విజ్ఞానం నింపి ఆదర్శంగా తీర్చి దిద్దాలని అధికారులను వారు ఈ సందర్బంగా కోరారు.. లేని పక్షంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో కుక్కల మహేందర్, కర్నాటి శివ గౌడ్, రాము, విద్యార్థి నాయకులు తదితరులు ఉన్నారు..