తెలంగాణ

హైదరాబాద్‌ మెట్రో నుంచి L&T ఎందుకు తప్పుకుంటోంది..? - కారణం ఎవరు..?

Metro L&T News : హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ను మొదటి నుంచి ఎల్‌ అండ్‌ టీ సంస్థే నిర్వహిస్తోంది. అయితే.. ఇప్పుడు ఆ పనుల నుంచి తప్పుకుంటామంటూ ప్రభుత్వానికి లేఖ రాసింది. దానికి కారణం ఏంటి…? అప్పులు, వడ్డీల భారం ఎక్కువగా ఉందని ఎల్‌ అండ్‌ టీ చెప్తోంది. అసలు కారణం అదేనా..? లేక… ఇందులో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా…? అన్న చర్చ జరుగుతోంది.

హైదరాబాద్‌లో రెండో దశ మెట్రో ప్రాజెక్ట్‌ను ప్రభుత్వమే నిర్మించాలని నిర్ణయించింది. ఇది ఎల్‌ అండ్‌ టీ సంస్థకు మింగుడు పడలేదా…? మెట్రో రైల్‌ ప్రాజెక్ట నుంచి తప్పుకుంటామని ఎల్‌ అండ్‌ టీ సంస్థ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. 6వేల కోట్లు ఇస్తే… ప్రాజెక్ట్‌ నుంచి వైదొలుగుతామని తెలిపింది. దీనిపై చర్చించిన ప్రభుత్వం… ఎల్‌ అండ్‌ టీ సంస్థను వెళ్లిపొవ్వమని చెప్పేందుకే సిద్ధమైనట్టు సమాచారం. మెట్రో రెండో దశ ప్రాజెక్టును ఎలాగూ ప్రభుత్వమే నిర్మించాలని నిర్ణయించింది. ఇప్పుడు.. ఎల్‌ అండ్‌ టీ వెళ్లిపోతే మొదటి దశ ప్రాజెక్ట్‌ పనులు కూడా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం సూచనలు ఇస్తోందట.

Read Also : పండుగలు వస్తే చార్జీలు పెంచడమే.. ఇదేం ప్రభుత్వం : హరీష్ రావు

అసలు ఎల్‌ అండ్‌ టీ ఎందుకు వెళ్లిపోదామనుకుంటోంది… దానికి కారణం ఏంటి…? అంటే… మెట్రో వల్ల లాభాలు రాకపోతే.. అప్పుతు, వడ్డీల భారం ఎక్కువవుతోందని ఎల్‌ అండ్‌ టీ సంస్థ భావిస్తోంది. ఇదిలా ఉంటే.. ఎల్‌ అండ్‌ టీకి కేటాయించిన ఆస్తుల విషయంలో నిర్వహణ సరిగా లేకపోవడంతో… ప్రభుత్వం అసంతృప్తితో ఉందని సమాచారం. ప్రభుత్వం నుంచి సరైన మద్దతు రాకపోవడంతో… మెట్రో ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవాలని ఎల్‌ అండ్‌ టీ భావిస్తోందా..? అంటే… కావొచ్చు అనే సమాధానం వస్తోంది.

Read Also : కనకదుర్గమ్మ సాక్షిగా తప్పుడు కథనాలను ఖండించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి!

మెట్రో రెండో దశ నిర్మాణానికి 24వేల 259 కోట్లతో మొదటి విడత, 19వేల 450 కోట్లతో రెండో విడత పనులు చేపడతామని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రెండో విడత పనులు ప్రభుత్వమే నిర్వహించాలని భావిస్తున్నప్పుడు.. మొదటి విడత కూడా చేపట్టడంలో ఇబ్బందులు ఉండవని భావిస్తోంది. ఈ క్రమంలో.. పొమ్మనలేక… ఎల్‌ అండ్‌ టీకి పొగపెడుతున్నారా..? అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. మెట్రో ప్రాజెక్ట్‌ను ఇప్పటి వరకు సమర్థవంతంగా నిర్వహించింది ఎల్‌ అండ్‌ టీ. ఆ సంస్థను.. ప్రభుత్వం బాహాటంగా పొమ్మని చెప్పలేదు. ఈ క్రమంలో… అంతర్గత ఒత్తిడి ఉండొచ్చన్న చర్చ కూడా జరుగుతోంది. ఏదిఏమైనా.. మెట్రో నుంచి త్వరలోనే ఎల్‌ అండ్‌ టీ తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button