తెలంగాణ

సీఎం రేవంత్‌రెడ్డి.. కిషన్‌రెడ్డిని ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు..? - దీని వెనకున్న పొలిటికల్‌ స్ట్రాటజీ ఏంటి..?

తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి…. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మధ్య కొన్ని రోజులుగా మాటల యుద్ధం జరుగుతోంది. తెలంగాణకు నువ్వేం చేశావంటే.. నువ్వేం చేశావంటూ… ఇద్దరూ విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి… కిషన్‌రెడ్డి టార్గెట్‌గా ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ అభివృద్ధిని కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారని… ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిసి… తెలంగాణకు కావాల్సిన, రావాల్సిన నిధుల గురించి వినతిపత్రాలు ఇచ్చారు రేవంత్‌రెడ్డి. అదే రోజు ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో గంటకుపైగా మాట్లాడిన తెలంగాణ సీఎం… కిషన్‌రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి సీక్రెట్‌ పార్ట్‌నర్‌ అని ఆరోపించారు. అందుకే తనకు మంచిపేరు రాకూడదని…. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అంటే… కేసీఆర్‌, కిషన్‌రెడ్డి ఒకటే అని చెప్పే ప్రయత్నం చేశారు. కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు తెస్తే.. కిషన్‌రెడ్డికి సన్మానం చేస్తామని కూడా చెప్పారు సీఎం.

ఢిల్లీ పర్యటన తర్వాత కూడా… కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై విమర్శలు ఎక్కుపెడుతూనే ఉన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. నిన్న (శుక్రవారం) ఉదయం.. ఏకంగా తొమ్మిది పేజీల లేఖ రాశారు. పీసీసీ విస్తృత స్థాయి సమావేశం తర్వాత జరిగిన ప్రెస్‌మీట్‌లో అయితే… కిషన్‌రెడ్డిపై మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. కిషన్‌రెడ్డి తెలంగాణకు సైంధవుడిగా మారాడంటూ… ఆరోపించారు. హైదరాబాద్‌కు మెట్రో రాకుండా అడ్డుపడుతున్నారని.. అలాగే, రీజినల్‌ రింగ్‌ రోడ్డు, మూసీ పునరుద్దరణ.. ఇలా ఏ పనిని ముందుకు కదలనివ్వకుండా చేస్తున్నారని ఫైరయ్యారు. ఆరేళ్లు కేంద్ర మంత్రిగా ఉండి… తెలంగాణకు ఏం తెచ్చావ్‌ కిషన్‌రెడ్డి అంటూ ప్రశ్నించారు. ఆయన కేసీఆర్‌ ఓడిపోయిన బాధలో ఉన్నారని… అందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వంలో తెలంగాణ మంచి జరగకూడదని చూస్తున్నారని ఆరోపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌, ఈ-ఫార్ములా రేస్‌ కేసుల్లో కేసీఆర్‌, కేటీఆర్‌ అరెస్ట్‌ కాకుండా కాపాడుతోంది కూడా కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ అని అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

ఎప్పుడూ లేనంతగా… రేవంత్‌రెడ్డి ఇంతలా ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు. కిషన్‌రెడ్డినే ఎందుకు టార్గెట్‌ చేశారు…? కొద్దిరోజుల నుంచే… ఎందుకు విమర్శల్లో ఘాటు పెంచారు..? దీని వెనుక ఏదైనా స్ట్రాటజీ ఉందా…? ఇచ్చిన హామీలే కాదు… తెలంగాణ అభివృద్ధికి తలపెట్టిన పనులు ముందుకు కదలడంలేదు…. అది కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యమని ప్రతిపక్షాలు గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ఈ పరిస్థితిలో గట్టి కౌంటర్‌ ఇవ్వకపోతే కుదరదని సీఎం రేవంత్‌రెడ్డి అనుకున్నట్టు ఉన్నారు. అందుకే.. పనులు ముందుకు కదలకపోవడానికి బీజేపీనే కారణమని… ఆ పార్టీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి …

  1. విషాదమును మిగిల్చిన SLBC టన్నెల్ సంఘటన.. 8 మంది కార్మికులు మృతి!..

  2. పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీలుగా గెలిచేది వీళ్లే.. క్రైమ్ మిర్రర్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్

  3. చనిపోయిన కోళ్లను చెరువు కట్టపై పడేసిన దుండగులు..

  4. ఫ్రీ కరెంట్ స్కీం బంద్? వినియోగదారుల్లో టెన్షన్

  5. రాష్ట్రంలో ఖజానా ఖాళీ అంటున్న ముఖ్యమంత్రులు!… క్రైమ్ మిర్రర్ ప్రత్యేక కథనం… ప్రజల కోసం?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button