
చలనచిత్ర పరిశ్రమలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రధానం చేసే సైమా అవార్డులు ఈసారి టాలీవుడ్ లో ఏడుగురికి వరించాయి. దీంతో సైమా నిర్వాహకులు అవార్డులు గెలుపొందిన వారిని ఒకే వేదికపై పిలిచి సత్కరించారు. ఇందులో భాగంగా ఓ ఈవెంట్ ని కండక్ట్ చేసి టాలీవుడ్ నుంచి పలువురు సినీ ప్రముఖులను కూడా పిలిచారు. అయితే ఈ ఈవెంట్ కి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ముఖ్యఅతిథిగా హాజరై సైమా అవార్డులు గెలుపొందిన డైరెక్టర్లు హీరోలు మరియు ఇతర టెక్నీషియన్స్ ని అభినందించారు.
అలాగే ఏడు నేషనల్ అవార్డులు గెలవడం అంటే మామూలు విషయం కాదని ఇది ఇలాగే కొనసాగుతూ మరింత మంది ఆర్టిస్టులు తమ ప్రతిభను నిరూపించుకొని నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డులను అందుకోవాలని మనస్పూర్తిగా కోరుతున్నట్లు తెలిపారు. అయితే సైమా అవార్డులు గెలుచుకున్న వారిని ఒకే వేదిక పై పిలిచి సత్కరించడం రియల్లీ గ్రేట్ అంటూ సైమా నిర్వాహకులను అప్రిషియేట్ చేశారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వాళ్లదేనని అందుకే ఏదైనా చేద్దామన్నా కూడా కుదరడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీకి అవార్డులు వచ్చినప్పటికీ ఇండస్ట్రీ స్పందించక ముందే సైమా నిర్వాహకులు అవార్డులు గెలుపొందిన వారిని ఒకే వేదికపై పిలిచి సత్కరించారని దీంతో ఇండస్ట్రీలో కల్చర్ తక్కువైందంటూ పరోక్షంగా కామెంట్లు చేశారు. దీంతో అల్లు అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా మరియు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
ఈ క్రమంలో కొందరు నెటిజెన్లు ఈ విషయంపై స్పందిస్తూ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నలుగురు సీనియర్ హీరోల కుటుంబాలు చక్రం తిప్పుతున్నాయని, థియేటర్ల విషయమైనా, లేదా ఏదైనా ఇండస్ట్రీ కి సంబంధించిన ఇతర విషయాలైనా ఈ నలుగురు కుటుంబాలు జోక్యం చేసుకొని మేనేజ్ చేస్తున్నాయని ఈ పద్ధతి మారాలని కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా ఈ నలుగురు సీనియర్ కుటుంబాల నుంచే అరడజనుకు పైగా హీరోలు ఉన్నారని దీంతో కొత్త వాళ్లకు స్కోప్ లేకుండా పోతుందని మరికొందరు అంటున్నారు. ఇక అల్లు అరవింద్ కూడా మెగాస్టార్ ఫ్యామిలీతో విభేదిస్తున్నారని అందుకే అల్లు అర్జున్ కి మెగా కాంపౌండ్ తో పడటం లేదని మరికొందరు అంటున్నారు. ఏదేమైనప్పటికీ అల్లు అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం దుమారం రేపడంతో సీనియర్ హీరోలు ఎలా స్పందిస్తారని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.