అంతర్జాతీయంజాతీయం
Trending

IND vs PAK ఇద్దరిలో ఎవరి సైన్యం బలవంతమైనది?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- భారత్ మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగడం ఖాయం అనిపిస్తుంది. తాజాగా కాశ్మీర్లోని పహాల్గంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పులలో 30 మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. చాలామంది గాయపడ్డారు. అయితే ఈ కాల్పులు ఘటన వెనుక పాకిస్తాన్ హస్తము ఉందని చాలానే అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఇక పాకిస్తాన్ పై భారత్ తీవ్రంగా అనుమానిస్తుంది. ఈ క్రమంలోనే ఇరుదేశాల మధ్య పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిపోయింది. ఈ సందర్భంలోనే ఖచ్చితంగా రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుందనే చర్చలు చాలానే వెలుగులోకి వస్తున్నాయి. దీంతో యుద్ధ వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి సందర్భంలోనే ఒకవేళ కచ్చితంగా యుద్ధం జరిగితే భారత్ మరియు పాకిస్తాన్ దేశాలకు సైన్య బలాలు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

భారత్ మరియు పాకిస్థాన్ల మధ్య యుద్ధమే జరిగితే కచ్చితంగా భారతదేశానిదే పై చేయని చెప్పాలి. కచ్చితంగా భారత్ విజయం సాధిస్తుంది. మన భారతదేశ జనాభా 1.4 బిలియన్లకు పైగానే ఉంది. అంటే దాదాపుగా 140 కోట్ల మంది జనం ఉంటారు. ఇక భారత సైనిక శక్తిక మానవ వనరుల పరంగా తిరుగులేని శక్తిగా ఉంది. భారతదేశ రక్షణ బడ్జెట్ 5.94 లక్షల కోట్లు. అంటే (73.8 బిలియన్ ) అదే పాకిస్తాన్ బడ్జెట్ కేవలం (6.34 బిలియన్). ఇక ప్రపంచంలోనే అత్యధిక సైనిక బలం కలిగిన దేశాల్లో భారత్ఒకటి. భారతదేశంలో అక్షరాల 14.4 లక్షల మంది యాక్టివ్ సైనికులు ఉన్నారు. రిజర్వులో 11 లక్షల మంది సైనికులు ఉన్నారు. దీంతో మొత్తంగా పారా మిలటరీ లో 25 లక్షలకు పైగానే మిలిటరీ సైనికులు ఉన్నారు. ఇక పాకిస్తాన్ దగ్గర కేవలం 6.5 లక్షల మంది మాత్రమే సైనికులు ఉన్నారు. భారత్లో ఆయుధాలు, యుద్ధ ట్యాంకులలో చాలా అస్త్రాలు ఉన్నాయి. అర్జున్ ట్యాంకులు, టి 90 బీమ్, బ్రహ్మోస్ క్షిపణులు, రాకెట్ లాంచర్లు, అత్యాధునికమైన వెపన్స్ ఉన్నాయి. ఇక పాకిస్తాన్ వద్దకు వస్తే చైనా లేదా పాశ్చాత్య దేశాలు అందిస్తున్న ఆయుధాలపై ఆధారపడుతుంది.

భారతదేశ వైమానిక దళంలో 2229కి పైగా విమానాలు ఉన్నాయి. 600కు పైగా యుద్ధం విమానాలు ఉన్నాయి. సహాయకు విమానాలు 831, హెలికాప్టర్లు 900 ఉన్నాయి. ఇక అత్యాధునిక టెక్నాలజీ కలిగిన యుద్ధ విమానాలు కూడా చాలానే ఉన్నాయి. కానీ పాకిస్తాన్ వైమానిక దళంలో చైనా సహకారం అందించిన 17 థండర్, ఎఫ్16లు, మిరాజ్ యుద్ధ విమానాలు ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర ఉన్న యుద్ధ విమానాలు దాదాపు పాతకాలం టెక్నాలజీని కలిగి ఉన్నాయి. అవి కూడా చాలా తక్కువనే ఉన్నాయి. ఇక నౌక దళ బలాలు, సాంకేతికత వ్యూహాత్మకత బలాలు, అను శక్తి సామర్థ్యాలు పోల్చుకుంటే పాకిస్తాన్ భారత్ కాలి గూటికి కూడా సరిపోదు.

ఇక మొత్తంగా భారత్ శక్తి ముందు పాకిస్తాన్ నిలబడలేదు. ఎందుకంటే పెద్ద ఆర్థిక వ్యవస్థ, అత్యాధునిక ఆయుధాలు, అధిక మానవ వనరులు అనేవి భారత సైన్యాన్ని శక్తివంతంగా మార్చాయి. ఒకవేళ యుద్ధానికి దిగితే పాకిస్తాన్ కొద్ది రోజుల్లోనే అంతమవుతుందని అధికారులు వెల్లడించిన రిపోర్టులు పేర్కొంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button