హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్యా థియేటర్ కు పుష్ప-2 సినిమా ప్రీమియర్స్ షో సందర్భంగా అల్లు అర్జున్ వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ రాకతో అక్కడ జనం భారీగా అల్లు అర్జున్ చూడడానికి ఎగబడిన సందర్భంలో రేవతి అనే మహిళా ఆ తొక్కిసలాటలో మరణించింది . తన కొడుకు కూడా ప్రస్తుతం చావు బతుకుల మధ్య ఐసీయూలో ఉన్నాడు. ఇక ఈ ఘటనలో అల్లు అర్జున్ శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. వెంటనే మభ్యంతర బెయిల్ ద్వారా శనివారం ఉదయాన్నే ఇంటికి కూడా చేరుకున్నాడు.
బిగ్ బాస్ విన్నర్ గా నిఖిల్!… ప్రైజ్ మనీ 88 లక్షలా?
ఇక ఈ సందర్భంలో చాలామంది టాలీవుడ్ ప్రముఖులు అలాగే రాజకీయ నేతలు కూడా చాలామంది అల్లు అర్జున్ ఇంటికి వచ్చి మరీ పరామర్శించారు. ఒక రాత్రి జైలుకు వెళ్లి వస్తేనే పరామర్శలు చేస్తున్నారు.!!
గత 12 రోజులుగా చావుతో పోరాడుతున్న
ఆ బాబు గురించి గానీ, చనిపోయిన వాళ్ళ అమ్మ
గురించి గానీ ఏ ఒక్కరూ మాట్లాడటం లేదు. వీరు సినిమా హీరోలు. ప్రాణాలు కోల్పోయిన మహిళను చూసే దిక్కు లేదు.. పైగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటాను అని ఒక్క స్పందన రాని వాల్ల గురించి కొందరు ఎగేసుకొని దిగేసుకొని తగుణమ్మ అని పరామర్శలు చేస్తున్నారు. అయితే టాలీవుడ్ ప్రముఖులు పరామర్శించడం సరి కాదని ఎవరు చెప్పట్లేదు. కానీ అవతల చావు బతుకుల మధ్య ఉన్న పిల్లాడిని వీళ్లు అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
భూమి లేని వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్?
అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజను కలవక పోవడానికి గల కారణం కూడా అల్లు అర్జున్ వివరించాడు. కొంతమంది నిపుణులు చెప్పిన కారణంగా ఈ కేసుల విచారణ సమయంలో శ్రీ తేజను కలవకపోవడం మంచిదని చెప్పినట్లుగా అతను చెప్పాడు. త్వరగా ఆ బాలుడు కోలుకోవాలని కోరుకుంటున్నాను అన్నట్లుగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పోస్ట్ చేశాడు. అతన్ని కలువులేక పోతున్నందుకు అలాగే అతని ఇంటికి వెళ్లడం కుదరలేదు కాబట్టి త్వరలోనే వారి కుటుంబానికి కలిసి మాట్లాడుతా అంటూ వెల్లడించారు. వారిని కచ్చితంగా ఆదుకుంటానని ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాను అన్నట్టుగా అల్లు అర్జున్ వెల్లడించాడు. అతని కుటుంబానికి నష్టపరిహారం కింద 25 లక్షలు ఇవ్వాలని నిర్ణయించుకుని అనౌన్స్ కూడా చేశాడు. అలాగే చికిత్స ఖర్చులు కూడా భరిస్తానని చెప్పాడు. అయితే అల్లు అర్జున్ ను పరామర్శించినట్లుగా ఆ పిల్లాడికి తన తల్లి చనిపోయిన మరణం విషయం కూడా తెలుసు లేదో అన్నట్లుగా చాలా మంది బాధపడుతున్నారు.