
White Hair: సాధారణంగా వయస్సు పెరిగితే తెల్ల జుట్టు రావడం సహజం. కానీ ఇప్పటి కాలంలో చిన్నపిల్లలకు కూడా తెల్లజుట్టు కనిపించడం ఆందోళనకరం. దీనికి డైట్ లోపం, అతిగా స్ట్రెస్, కాలుష్యం, కెమికల్ ఉన్న హెయిర్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం వంటి కారణాలు ప్రధానాలు. అయితే ఇంట్లోనే సులభంగా చేసుకునే కొన్ని చిట్కాలతో తెల్లజుట్టు సమస్యను తగ్గించుకోవచ్చు.
కొబ్బరి నూనెలో బ్లాక్ హెన్నా కలిపి పేస్ట్ తయారు చేసి జుట్టుమీద అప్లై చేస్తే క్రమంగా తెల్లజుట్టు నల్లగా మారుతుంది. అలాగే కొబ్బరి నూనెలో నల్ల నువ్వులు వేసి మరిగించి రాత్రంతా జుట్టుపై ఉంచడం కూడా మంచి ఫలితాలిస్తుంది. కొబ్బరి నూనెలో ఉసిరి పొడి వేడి చేసి ఉపయోగిస్తే జుట్టుకు బలం వస్తుంది. జుట్టు రంగు సహజంగా మెరుగుపడుతుంది.
ఇంతేకాకుండా డైట్‌లో పాలకూర, బాదం, గుడ్లు వంటి ఐరన్, బయోటిన్ ఉన్న ఆహారాలు తప్పనిసరిగా ఉండాలి. స్ట్రెస్ తగ్గించడానికి యోగా, మెడిటేషన్ చేయడం, కెమికల్ ప్రొడక్ట్స్ తగ్గించడం, తరచూ కొబ్బరి నూనె మసాజ్ చేయడం వంటి అలవాట్లు పాటిస్తే తెల్లజుట్టు సమస్యను సహజంగా నియంత్రించుకోవచ్చు.
ALSO READ: R K Singh: కేంద్ర మాజీమంత్రిపై బీజేపీ వేటు.. పార్టీ నుంచి సస్పెన్షన్





