
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- భారత్ పై ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు భారత ప్రజలకు మాత్రమే కాకుండా
ప్రధాన రాజకీయ నాయకులకు కూడా మండుతుంది. తాజాగా యూఎస్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ H1B వీసా ఫీజు భారీగా పెంచిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ నేడు గుజరాత్ పర్యటనలో భాగంగా స్పందించారు. కేవలం స్పందించడమే కాకుండా మన ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. “విదేశాలపై ఆధారపడడమే మన భవిష్యత్తుకు అతి పెద్ద శత్రువు” అని కీలక వ్యాఖ్యలు చేశారు. మన దేశంలో 140 కోట్ల మంది ఉన్నాము.. స్వయం సమృద్ధి సాధించడమే మనందరి లక్ష్యం అని వ్యాఖ్యానించారు. మనకి ఇది తప్ప వేరే ఆప్షనే లేదు అంటూ.. చిప్స్ నుంచి షిప్స్ వరకు కూడా ప్రతి ఒక్కటి మన ఇండియాలోనే తయారవ్వాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం నేను కొత్త సంస్కరణలను తీసుకొస్తా… వన్ నేషన్, వన్ పోర్ట్ ప్రాసెస్ తో ట్రేడ్ అనేది సులభతరం అవుతుంది అని ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యానించారు.
Read also : రేపే సూపర్ సండే మ్యాచ్… పాకిస్తాన్ ను మరోసారి అవమానిస్తారా?
అసలు ఈ షిప్పింగ్ సెక్టార్ లో ప్రస్తుతం మన మన దేశం ఎదుర్కొంటున్న నష్టాలకు అప్పటి కాంగ్రెస్ చేతకాని పాలన వలనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని.. నరేంద్ర మోడీ అన్నారు. నేడు గుజరాత్ పర్యటనలో భాగంగా ఒకప్పటి భారతదేశం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మన భారతదేశం ఒకప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద నౌక తయారీ కేంద్రంగా ఉండేది. కానీ కాంగ్రెస్ చేసిన పనికి మనం ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నాం. కాంగ్రెస్ విదేశీ నౌకలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్లే నేడు ఈ పరిస్థితి వచ్చిందంటూ చెప్పుకొచ్చారు. దాదాపు 90 శాతం ట్రేడ్ కోసం విదేశీ షిప్స్ పైనే ఆధారపడాల్సి వస్తుందని.. వీటి వలన ఆరు లక్షల కోట్లు విదేశీ కంపెనీలకు చెల్లిస్తున్నామని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరు లక్షల కోట్లు మన రక్షణ బడ్జెట్ కు సమానం అని వ్యాఖ్యానించారు.
Read also : వైసీపీకి బిగ్ షాక్… అనుమతి లేదంటూ పోలీసులు కేసు నమోదు?