
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం కావాలనే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకీకరణ చేస్తుంది అని ఆరోపించారు. దీంతో ఈ నెల 10న నియోజకవర్గ వ్యాప్తంగా అలాగే 13వ తేదీన జిల్లా స్థాయిలో భారీగా ర్యాలీలు నిర్వహించాలి అని వైసిపి కార్యకర్తలు మరియు అభిమానులకు సూచించారు. ఇక 16వ తేదీన నేరుగా గవర్నర్ ను కలిసి ప్రైవేట్కీకరణ వల్ల నష్టాలు గురించి తెలియజేస్తామని సజ్జల తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోకూడదు అని.. ఇందుకుగాను ప్రతి ఒక్కరూ కూడా మద్దతుగా నిలవాలి అని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. ఈ నేపథ్యంలోనే గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటుగీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణకు అద్భుతమైన స్పందన వస్తుంది అని అన్నారు. ఈ విషయంలో అన్ని విభాగాల వారు ప్రతిష్టాత్మకంగా పనిచేయాలి అని విజ్ఞప్తి చేశారు. ఈనెల 13వ తేదీన ప్రతి జిల్లాలో 10వేల మందితో ర్యాలీలు నిర్వహించాలి అని… ఏ జిల్లాలో చూసిన కూడా కోటి సంతకాల కార్యక్రమం హడావిడి కనపడాలి అని వైసీపీ కార్యకర్తలు మరియు అభిమానులకు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశించారు. ప్రతి ఒక్క జిల్లాలోని వైసీపీ నాయకుడు మరియు కార్యకర్తలు ఈ ర్యాలీలలో పాల్గొని తీరాలి అని అన్నారు.
Rwad also : మండల ఎన్నికల అధికారి నిర్లక్ష్యంతో నర్సంపల్లి పంచాయతీ ఎన్నిక వాయిదా
Read also : మన రాజధాని అద్భుతంగా ఉండాలి.. నాణ్యతలో రాజీ పడకండి : సీఎం





