
క్రైమ్ మిర్రర్, వెబ్ డెస్క్ :- పహల్గాం తీవ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ పై అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి ఉంది. ఓవైపు పొరుగుదేశం భారత్ ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలతో పాకిస్తాన్ ను అష్టదిగ్బంధం చేస్తోంది. ఏ క్షణమైనా యుద్ధ ప్రకటన వచ్చినా ఆశ్చర్యం లేదనే చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఆర్ధిక ఇబ్బందులతో కునారిల్లుతున్న పాకిస్తాన్ కు ప్రపంచ బ్యాంక్ భారీ ఊరటనిచ్చింది. పాకిస్తాన్ కు ఏకంగా 108 మిలియన్ల అమెరికా డాలర్ల సాయం అందించింది.
వాయువ్య పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో మహిళలు, బాలికల జీవితాలను మెరుగుపరచడానికి ప్రపంచ బ్యాంకు 108 మిలియన్ల అదనపు నిధులను మంజూరు చేసింది. పఖ్తుంఖ్వా ఇంటిగ్రేటెడ్ టూరిజం డెవలప్‌మెంట్ మరియు ఖైబర్ పఖ్తుంఖ్వా రూరల్ యాక్సెసిబిలిటీ ప్రాజెక్ట్ ల కోసం 30, 78 మిలియన్ డాలర్ల చొప్పున మొత్తం 108 మిలియన్ డాలర్ల సాయం విడుదల చేసింది. మార్కెట్లు, ఉద్యోగాలు, ఆరోగ్యం, విద్య సేవల అభివృద్ది కోసం ఈ నిధులు ఇచ్చినట్లు ప్రపంచ బ్యాంక్ తెలిపింది.
మరో 24 గంటల్లో భారత్ దాడి చేస్తుంది : పాక్
ఉగ్రదాడి ఎఫెక్ట్… పాకిస్తాన్ జిందాబాద్ అన్నందుకు కొట్టి చంపేశారు!.