
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ప్రతిరోజు కూడా ఎంతలా వేడిగా ముందుకు వెళ్తున్నాయి అంటే ఆ వేడికి అధికారం మరియు ప్రతిపక్ష పార్టీ నాయకులు తో పాటు ప్రజలు కూడా బిత్తరిపోవాల్సి వస్తుంది. ప్రతి రోజు కూడా ఏదో ఒక కారణం తో అధికార మరియు ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లోకసభలో మాట్లాడిన ఓట్ చోరీ విషయం పై ప్రతి ఒక్క కూటమి కార్యకర్త మండిపడుతున్నారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ 2024 ఎలక్షన్లప్పుడు విజయనగరం, చిత్తూరు మరియు హిందూపురం నియోజకవర్గాలలో ఓటు చోరీ జరిగింది అని మాట్లాడారు. అయితే తాజాగా ఈ విషయంపై టిడిపి ఎంపీ అప్పలనాయుడు స్పందిస్తూ మిథున్ రెడ్డి పై తీవ్రంగా మండిపడ్డారు. “2019 ఎలక్షన్లలో మీరు గెలిచినప్పుడు అది ప్రజలు తీర్పు అన్నారు.. మరి మేం గెలిస్తే అది ఓటు చోరీ నా”?.. అని ప్రశ్నించారు. ఓటు చోరీ విషయంపై మీరు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది అంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో పలు ఎన్నికలు ఏ విధంగా జరిగాయో ప్రజలందరికీ కూడా తెలుసు అని ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు వైసీపీ పార్టీపై కౌంటర్లు వేశారు. ఏదైనా మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడితే మంచిదని సూచించారు. ఊరికే నోరు ఉంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా మాట్లాడితే బాగోదు అని అన్నారు.
Read also : రామ్మోహన్ కు ఆ శాఖ ఇచ్చింది డాన్సులు, రీల్స్ చేసుకోవడానికా?.. పేర్ని నాని ఆగ్రహం
Read also : ఆ జలపాతం వైపు ఎవరూ వెళ్లొద్దు.. శబరిమల వెళ్లే భక్తులకు అటవీశాఖ సూచన!





