
-
సహాయం చేయాలని వెళ్లి మృత్యువాత
-
టైర్ మార్చడానికి వెళితే మరో కారు ఢీకోట్టింది
-
ఔటర్ ఎగ్జిట్ పాయింట్ వద్ద విషాద ఘటన
గండిపేట్(క్రైం మిర్రర్): ఓఆర్‌ఆర్‌పై ప్రయాణిస్తున్న వాహనం ఆగిపోవడంతో అతడికి సహాయం చేసేందుకు వచ్చిన డ్రైవర్‌ను అతివేగంగా వచ్చిన టయోటో కారు ఢీకోట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఔటర్ రింగ్ రోడు మీదుగా శంషాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు డ్రైవర్ నిద్రమత్తులో మీడియన్‌కు తగిలి బ్రేక్ డౌన్ అయింది. అది గమనించి సహాయం చేయడానికి ఆగిన మరోక కారు ఇంతలో శంషాబాద్ వైపు నుంచి టీజీపీఏ వైపు వెళ్తున్న రికవరీ వ్యాన్ డ్రైవర్ శివకేశవ రోడ్డు దాటి వచ్చి బ్రేక్ డౌన్ అయిన కారు టైర్లు మారుస్తున్నాడు. మితిమీరిన వేగంతో దూసుకువచ్చిన టయోటో కారు ఢీకోట్టింది. రికవరీ వ్యాన్ డ్రైవర్ శివకేశవ అక్కడికక్కడే మృతి చెందగా మరోకరికి తీవ్ర గాయాలైయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అప్రమత్తత, జాగ్రత్త ఎంతో అవసరం…
ప్రయాణానికి బయలుదేరే ముందు వెహికిల్ కండిషన్, ప్యూయల్ చెక్ చేసుకోవాలన్నారు. వెహికిల్ అత్యవసరంగా ఆపే పరిస్థితి వస్తే ఎమర్జెన్సీ పార్కింగ్‌లోనే ఆపాలన్నారు. ఓఆర్‌ఆర్‌పై వెహికిల్ బ్రేక్ డౌన్ అయితే వెంటనే ఎమర్జెన్సీ పార్కింగ్ ఇండికేటర్స్ ఏర్పాటు చేయాలి. వెంటనే ఓఆర్‌ఆర్ ఎమర్జెన్సీ నెంబర్ 14449కి ఫోన్ చేయాలన్నారు. ఓఆర్‌ఆర్‌పైన ఉన్న ఎస్‌వోఎస్ సిస్టమ్ ద్వారా అత్యవసరంగా ఉన్న పరిస్థితి తెలియజేయాలన్నారు. లేదా 100 ద్వారా పోలీసులకు సమాచారాన్ని ఇవ్వాలన్నారు. ఫ్లై ఓవర్‌పై వెళ్తున్నప్పుడు వెహికిల్స్ బ్రేక్ డౌన్ అయితే వెంటనే ఎమర్జెనీ ఇండికేటర్ వేయాలన్నారు.
వెహికిల్ బ్రేక్ డౌన్ అయితే నోటీస్ చేసిన వ్యక్తుదలు సహాయం చేయడానికి వెళ్లకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఎందుకంటే వెహికిల్ మూవ్‌మెంట్ స్పీడ్ ఉంటుంది సరైన జాగ్రత్తలు తీసుకోని మాత్రమే వెహికిల్ రిపేర్ లేదా వెహికిల్ టోనింగ్ చేయాలన్నారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సురక్షితంగా ప్రయాణం చేయాలని సూచించారు.