
WhatsApp: ఇప్పుడు వాట్సాప్ వినియోగదారులకు ఒక పెద్ద సౌకర్యం అందుబాటులోకి వచ్చినట్టైంది. ముందుగా టీమ్స్, గూగుల్ మీట్ వంటి ప్లాట్‌ఫార్మ్‌ల్లో మాత్రమే కనిపించే షెడ్యూల్ ఫీచర్‌ను ఇప్పుడు వాట్సాప్ కూడా అందించింది. ఈ అప్‌డేట్‌తో ఉద్యోగులు, స్నేహితులు, కుటుంబం వంటి గుంపులతో ముందుగానే కాల్ సమయాన్ని నిర్ణయించి మీటింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. వాయిస్‌తో పాటు వీడియో కాల్ షెడ్యూల్ కూడా చేసుకునే అవకాశం రావడంతో వ్యక్తిగత, ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ మరింత సులభతరమైంది.
షెడ్యూల్ కాల్ క్రియేట్ చేసే సమయంలో కాల్ ఉద్దేశం స్పష్టంగా రాయడం, కాల్‌లో పాల్గొనాల్సిన వారిని సెలెక్ట్ చేయడం వంటి ఆప్షన్‌లు కూడా ఈ ఫీచర్‌లో ఉన్నాయి. షెడ్యూల్ చేసిన తర్వాత వాట్సాప్ ప్రత్యేక లింక్‌ను జనరేట్ చేస్తుంది. ఆ లింక్‌ను కాపీ చేసి పాల్గొనేవారితో షేర్ చేస్తే, కాల్ ప్రారంభం కావడానికి ముందే వారికి నోటిఫికేషన్ ఆటోమేటిగ్గా పంపబడుతుంది. దీనివల్ల నిర్ణయించిన సమయానికి అందరూ ఒకేసారి కనెక్ట్ కావడానికి సౌకర్యం లభిస్తుంది.
ఈ కొత్త ఫీచర్ రావడంతో వినియోగదారులు పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి ఉద్యోగులు, ఆన్‌లైన్ మీటింగ్‌లు ఎక్కువగా నిర్వహించే వారు ఈ ఫీచర్‌ను ఎంతో ఉపయోగకరమైందిగా భావిస్తున్నారు. స్నేహితులతో ప్లాన్ చేసిన చాట్‌లు, కుటుంబ సమావేశాలు కూడా ఒక క్లిక్‌లో ఆర్గనైజ్ చేసుకునే వీలు రావడంతో వాట్సాప్ మరింత ప్రాక్టికల్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫార్మ్‌గా మారిందని స్పందిస్తున్నారు.
ALSO READ: Flipkart Black Friday Sale: భారీ డిస్కౌంట్లకు కౌంట్‌డౌన్ ప్రారంభం





