
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- భారత స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ అతని భార్య హసిన్ జహాన్ విడాకులు తీసుకున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే విడాకుల తర్వాత ప్రతినెలా కూడా 4 లక్షల రూపాయలను భరణం కింద మహమ్మద్ షమీ తన భార్యకు చెల్లిస్తున్నాడు. అయితే ఆ డబ్బులు సరిపోవట్లేదు అని తాజాగా 10 లక్షల రూపాయలను చెల్లించాలి అని తన భార్య హసిన్ జహాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ప్రతి నెల కూడా 10 లక్షల రూపాయలు భరణం కింద ఇవ్వాలి అని కోరిన హసీన్ వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు మండిపడింది. మరోవైపు సోషల్ మీడియా లోనూ ఈమె పై తీవ్రంగా మండిపడుతున్నారు. విడాకులు తర్వాత కూడా మళ్లీ మాజీ భర్త పై ఆధారపడడం ఏంటి అని ప్రశ్నించింది. సొంత కాళ్లపై నిలబడడం రాదా అంటూ ప్రశ్నించింది. మెయింటినెన్స్ అనేది మీరు ఎక్కడ నివసిస్తున్నారు.. పిల్లలకు ఖర్చు ఎంత అవుతుందో అనే దాని మీద ఉండాలి కానీ… ఆదాయం ఆధారంగా ఉండదు అని ఆమె పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వివరిస్తున్నారు. ఇక నైనా ఇలాంటి తమాషాలు మానుకోవాలని సూచించారు. కాగా సోషల్ మీడియా అంతటా కూడా షమి కి మద్దతు తెలుపుతూ.. కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కోరుతున్నారు.
Read also : అమ్మానాన్న మీ కలలను నెరవేర్చలేకపోయా.. “నన్ను క్షమించండి” అంటూ నీట్ విద్యార్థి ఆత్మహత్య!
Read also : శీతాకాలం ఆరంభం… పర్యాటకులతో అరకు అదుర్స్!





