
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- భారత్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా అద్భుత విజయాన్ని సాధించింది. కేవలం 124 పరుగులు చేదించలేక టెస్ట్ క్రికెట్ లోనే టీమిండియా ఒక చెత్త రికార్డును నమోదు చేసింది. ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఈ మొదటి టెస్ట్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో 159 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ తర్వాత భారత్ 189 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికా 153 పరుగులు చేయగా ఇండియా కేవలం 93 పరుగులకే ఆల్ అవుట్ అయ్యి ఘోరపరాజయాన్ని పొందింది. దీంతో 30 పరుగులు తేడాతో సౌత్ ఆఫ్రికా ఘనవిజయాన్ని అందుకుంది. రెండవ ఇన్నింగ్స్ లో భారత బ్యాట్స్మెన్లు అందరూ కూడా పూర్తిగా విఫలమయ్యారు. వాషింగ్టన్ సుందర్, అక్షర పటేల్ మినహా ప్రతి ఒక్కరు కూడా తేలిపోయారు. ఏకంగా నలుగురు 0 పరుగులకే పరిమితమయ్యారు. టీమిండియా టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు 124 చేజింగ్ చేయలేకపోయింది. 1997లో వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 120 పరుగులు భారత్ చేంజ్ చేయలేకపోయింది. మళ్లీ 28 సంవత్సరాల తర్వాత రెండో లోఎస్ట్ టార్గెట్ ను చేదించడంలో భారత్ పూర్తిగా విఫలమయ్యింది. అటు టెస్టుల్లో సౌత్ ఆఫ్రికా డిఫెండ్ చేసుకున్న అతి తక్కువ స్కోరులో ఇది రెండవసారి. కేవలం 124 పరుగులను ఛేదించలేకపోవడంతో భారత జట్టుపై అభిమానులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read also : Psychology facts: టెక్స్ట్ మెసేజెస్‌లో నిజం తక్కువ- అబద్ధం ఎక్కువ!
Read also : Bandi Sanjay: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలు హిందువుల్లో కసిని పెంచాయి





