
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై కూటమి మంత్రి సత్య కుమార్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైనా సరే మెడికల్ కాలేజ్ టెండర్లలో పార్టిసిపేట్ చేస్తే.. మేము అధికారంలోకి వచ్చాక కచ్చితంగా వాటిని రద్దు చేస్తామని హెచ్చరించారు. మేము తెచ్చిన కాలేజీలను చంద్రబాబు నాయుడు కావాలనే ప్రైవేటీకరణ చేస్తున్నారని జగన్ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే జగన్ చేసిన వ్యాఖ్యలను మంత్రి సత్య కుమార్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి చెందడం అనేది వైసీపీకి అలాగే పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి అసలు ఇష్టం లేదనుకుంటా అని మంత్రి సత్య కుమార్ యాదవ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందుకే టెండర్ల విషయంలో ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా బెదిరిస్తున్నారని చెప్పుకొచ్చారు. “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమన్నా మీ అబ్బ సొత్తా”.. అని జగన్ మోహన్ రెడ్డి పై మంత్రి సత్య కుమార్ యాదవ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also : చిన్న జట్టుపై బుమ్రా ను ఆడించడం అవసరమా?.. ఆగ్రహిస్తున్న ఫ్యాన్స్!
మీ ప్రభుత్వంలో కాలేజీలు ఎక్కడ కట్టారో చూపించండి అని మంత్రి సత్య కుమార్ యాదవ్, జగన్మోహన్ రెడ్డి కు సవాల్ విసిరారు. టెండర్ల విషయంలో ఎంతమందిని బెదిరిస్తారు మీరు?.. మీ బెదిరింపులు వల్ల నష్టపోయేది విద్యార్థులే అని అన్నారు. మీ బెదిరింపులకు, తాటాకు చప్పులకు భయపడే ప్రసక్తే లేదు అని మంత్రి సత్య కుమార్ యాదవ్ జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించారు. ఇవాళ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా రాష్ట్రానికి ఎంతో అండగా నిలిచి… అభివృద్ధి బాటలో నడిపించడానికి సర్వశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కేంద్రం కూడా అన్ని విధాలుగా సహకరిస్తూ ఉందని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకు వెళ్తుంటే… మీ లాంటోళ్లు కావాలనే వాటికి అడ్డుకట్ట వేస్తున్నారని చెప్పుకొచ్చారు. వైసీపీ చేసే ప్రతి వాదన అబద్ధమే.. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే.. మీరు చెప్పేవన్నీ నిజమే అయితే అసెంబ్లీకి రండి అవన్నీ నిజమో అబద్దమో మేము తెలుస్తామని సత్యకుమార్ యాదవ్ వైసీపీ పార్టీకి సవాల్ విసిరారు.
Read also : అసెంబ్లీకి రాకుండా రప్పా రప్పా అంటూ రంకెలేస్తున్నారు : సీఎం చంద్రబాబు