
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు బిఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ దేవరకొండ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి గత పది ఏళ్లలో టిఆర్ఎస్ పార్టీ చేసింది శూన్యమే అని తెలిపారు. ఇక తమ కాంగ్రెస్ ప్రభుత్వానికి అభివృద్ధి మరియు సంక్షేమం అనేవి రెండు కళ్లు లాంటివి అని పేర్కొన్నారు. గత పది సంవత్సరాలలో కెసిఆర్ పేదలకు ఇల్లు ఇవ్వలేదు కానీ 2000 కోట్లతో ఏకంగా గడి కట్టుకున్నారు అని ఆరోపించారు. గత పది సంవత్సరాలలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఈపాటికి నిరుపేదలకు 22 లక్షల ఇల్లు ఇచ్చే వాళ్ళమని స్పష్టం చేశారు. ఇక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన చోట మేము ఓట్లు అడుక్కుంటాము.. మరి డబుల్ బెడ్ రూములు ఇచ్చిన చోట కేసీఆర్ ఓట్లు అడుగుతారా అని ప్రశ్నించారు. తన కూతురు కవిత, కొడుకు కేటీఆర్ మరియు తన అల్లుడే కెసిఆర్ ను ముంచుతారు అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీని పక్కా బొంద పెట్టేది మాత్రం కేటీఆర్ అని వ్యాఖ్యానించారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు లేదా ఎమ్మెల్యేలు వెళ్లినా కూడా అతను అసలు కలవనిచ్చేవాడు కాదు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మళ్లీ ఇప్పుడేమో కార్యకర్తలను ఏమీ బాధపడకండి మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది అని బుజ్జగింపులు చేస్తున్నాడు అని రేవంత్ రెడ్డి అన్నారు.
Read also : డిసెంబర్ 25న “అఖండ -2” చిత్రం
Read also : గిరిజన ప్రాంతాలలో సినిమాలు, సీరియల్ షూటింగ్లకు ప్రోత్సాహం ఇవ్వాలి : పవన్ కళ్యాణ్





