
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికలలో కూటమి ప్రభుత్వం ఘనవిజయం సాధించగా దానికి ముఖ్య కారణం మంత్రి నారా లోకేష్ ఎలక్షన్ కు ముందు చేసిన పాదయాత్ర ఒకటి. ఎలక్షన్ కు ముందు మంత్రి నారా లోకేష్ చేసినటువంటి యువగళం పాదయాత్ర రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకునేలా చేసింది. ఇక ముఖ్యంగా యువత మంత్రి నారా లోకేష్ కు సపోర్ట్ గా నిలబడ్డారు. ఈ యువ గళం పాదయాత్రలోనే మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ అంశాన్ని తీసుకువచ్చి ఎవరైతే గత ప్రభుత్వంలో అక్రమాలు,అన్యాయాలు అలాగే బెదిరింపులు చేస్తూ నాయకులు మరియు ప్రజలను ఇబ్బంది పెట్టారో వారిని ఈ బుక్ లో రాసుకొని అధికారం వచ్చిన తర్వాత కచ్చితంగా వారి తాటతీస్తామని నారా లోకేష్ ప్రతి కార్యక్రమంలోనూ చెప్పుకుంటూ వచ్చారు. అయితే తాజాగా అమెరికా డల్లాస్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్ కు ఒక అభిమాని కొడాలి నాని గురించి ప్రశ్నించారు. అయితే దానికి బదులుగా కొడాలి నానితో పాటుగా ఎంతోమంది అసెంబ్లీ సాక్షిగా అవమానించారు. అలాంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. మీకు ఈ విషయంపై ఎలాంటి డౌట్ అవసరం లేదు వారిని కచ్చితంగా చట్ట పరంగా శిక్షిస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. దీంతో త్వరలోనే కొడాలి నాని కూడా అరెస్ట్ తప్పదు అని అర్థమవుతుంది.
Read also : ఇండియన్ హార్ట్ అసోసియేషన్ హెచ్చరిక.. తస్మాత్ జాగ్రత్త!
Read also : సీఎంగా నేటితో రెండేళ్లు పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి..!





