ఆంధ్ర ప్రదేశ్సినిమా

అనుకున్నదే జరిగింది.. OG మూవీ రివ్యూ!

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన OG సినిమా నేడు దేశవ్యాప్తంగా విడుదలయ్యింది. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేసినా అభిమానులు ఈ సినిమా చూడడానికి థియేటర్లకు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. ఇప్పటికే టికెట్ల రేట్లు కూడా పెంచడంతో మొదటి రోజు ఈ సినిమాకి భారీగా కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. డైరెక్టర్ సుజిత్ , హీరోగా పవన్ కళ్యాణ్, హీరోయిన్ గా ప్రియాంక మోహన్, విలన్ గా ఇమ్రాన్ హష్మీ, మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ఎవరికివారు వారి బాధ్యతలను సక్రమంగా నిర్వహించినట్లు తెలుస్తుంది. ఎంతోమంది ఎదురుచూస్తున్న ఈ సినిమా నేడు విడుదలయ్యింది.

Read also : ఆదిభట్లలో పోక్సో కేసు నమోదు.. రిమాండ్ కు నిందితుడు తరలింపు!

OG మూవీ రివ్యూ

తాను నమ్ముకున్న వ్యక్తి కోసం , ఒక మాఫియాను అంతం చేయడానికి హీరో పవన్ కళ్యాణ్ ఏం చేశాడనేదే ఈ OG పూర్తి కథ. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ యాక్టింగ్, ఇమ్రాన్ హష్మీ విలనిజం, నందమూరి తమన్ మ్యూజిక్, ఇక ఎలివేషన్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. డైరెక్టర్ సుజిత్ తను అనుకున్న కథను అనుకున్నట్టుగానే తీశారు. యాక్షన్ అండ్ విలనిజం నచ్చేటువంటి వారికి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. అయితే కథ కంటే ఎలివేషన్స్ పైనే ఫోకస్ చేయడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. సాధారణంగా ప్రతి సినిమాలోను ట్విస్ట్సు అలాగే ఎమోషన్స్ ఉంటాయి. కానీ ఈ సినిమాలో ఇవి రెండు పెద్దగా చూపించకపోవడంతో ఫ్యాన్స్ తో పాటుగా ప్రేక్షకులు కూడా కాస్త ఆందోళన చెందారు. ఇక క్లైమాక్స్ కూడా రొటీన్ గా అనిపిస్తుండడంతో సాధారణ ప్రేక్షకులకు మామూలుగా అనిపిస్తుంది. ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ సినిమా మాత్రం ఒక పండుగే అని చెప్పవచ్చు.

మూవీ రేటింగ్ : 2.5/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button