
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి అలాగే నందమూరి తారకరామారావు ఇద్దరు కూడా రాష్ట్ర రాజకీయాలలో ప్రజలను ఎంతగా ప్రేమించారో… పార్టీలను కూడా నడిపి రాష్ట్రాలను అభివృద్ధి బాటలో నడిపిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి 2019లో భారీ మెజార్టీతో గెలుపొంది ముఖ్యమంత్రి అయ్యారు. కానీ అంతే భారీ మెజారిటీతో 2024 ఎన్నికలలో ఓడిపోవడం జరిగింది. కేవలం 11 సీట్లను సాధించి ఘోరంగా పరాజయం పొందారు. ప్రస్తుతం పార్టీ బలాన్ని పొందడం చాలా కష్టమని రాష్ట్ర రాజకీయాల్లో చాలానే చర్చలు జరుగుతున్నాయి. కానీ పార్టీ బలంగా మారాలంటే జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో ఎక్కడైనా సరే రాజకీయ పార్టీ బలపడాలంటే ఖచ్చితంగా భారీ సభలను నిర్వహిస్తూ ముందుకెళ్లాలి. దానికి సరైన రోజు అలాగే సరైన వేదిక కచ్చితంగా పార్టీ ఆవిర్భావం రోజున ఎంచుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పటికీ చాలా మంది రాజకీయ నాయకులు ఇలానే చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో చూస్తే జనసేన మార్చి 14న భారీ ఎత్తున ఆవిర్భావ సభను నిర్వహించి సత్తా చాటింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక నిన్న ఏప్రిల్ 27న తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ఏకంగా తన పార్టీ రజతోత్సవ సభను భారీ జన సందోహం మధ్య నిర్వహించి గులాబీమయంతో కొత్త ఉత్సాహాన్ని పార్టీ కార్యకర్తలలో నింపారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా మేమే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక మే నెలలో తెలుగుదేశం పార్టీ మహానాడు సభను అత్యంత ఘనంగా నిర్వహించబోతుంది. పైగా ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి అడ్డా అయినటువంటి కడపలో మహానాడు సభను నిర్వహించాలని టిడిపి ఆలోచిస్తుంది. దీంతో టీడీపీ నాయకులు అలాగే కార్యకర్తలలో సరికొత్త జోష్ నింపుతుంది. ఇక వైసిపి పార్టీ 2022 తర్వాత అధికారంలోకి వచ్చిన తరువాత ఒకసారి మాత్రమే పార్టీ మీటింగ్ ని గుంటూరులో ఘనంగా జరిగింది. సభలో జగన్మోహన్ రెడ్డి శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. ఆ తర్వాత ఈసీ నుంచి వచ్చిన అభ్యంతరాలతో దానిని విరమించుకున్నట్లుగా చాలానే వార్తలు వచ్చాయి. ఇక జగన్మోహన్ రెడ్డి అప్పటినుంచి ఇప్పటివరకు ఎటువంటి పెద్ద సభను నిర్వహించలేదు. అలాగే లీడర్ కి కేడర్ కి మధ్య ఎటువంటి సంబంధం కూడా ఉండట్లేదని అంటున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా నాయకులను ఉత్తేజపరిచే విధంగా పెద్ద పార్టీ సభలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా తమ బలం ఏంటో అలాగే ఇతరుల బలమేమిటో స్వయంగా తెలుసుకోవాలని అంటున్నారు. ఇలా పార్టీ కార్యకర్తలు అలాగే నాయకులలో ఆత్మవిశ్వాసం నింపాలని చాలామంది అంటున్నారు. వంటి ఆలోచనలు చేస్తేనే వైసిపి పార్టీ బలపడుతుందని రాజకీయంగా చర్చలు వినిపిస్తున్నాయి.