
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- టాలీవుడ్ యంగ్ నటుడు ప్రియదర్శి అలాగే నిహారిక జంటగా కలిసి నటించినటువంటి సినిమా మిత్రమండలి. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సత్య, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా వంటి ముఖ్య నటులు కీలకపాత్రలో నటించారు. బిv వర్క్స్ బ్యానర్ పై బన్నీ వాసు సమర్పణలో విజయేందర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అక్టోబర్ 16 అనగా.. నేడు రిలీజ్ అయిన ఈ సినిమా ముందు రోజు రాత్రి నుంచి ప్రీమియర్స్ వేశారు. కథ విషయానికి వస్తే… జంగిలి పట్నం అనే ఊర్లో ఎన్నికలు సమీపిస్తాయి. ఇక ఎమ్మెల్యే టికెట్ కోసం వీటివి గణేష్ అలాగే సత్య ప్రకాష్ పోటీ పడతారు. ఇక అదే ఊరిలో ప్రియదర్శి, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా అలాగే రాగ్ మయూరి అనే నలుగురు చిల్లర ఫ్రెండ్స్ గాళ్లు పని పాట లేకుండా ఇంట్లో ఎప్పుడూ తిట్లు తింటూ ఉంటారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే తండ్రి కులాంతర పెళ్లికి ఒప్పుకోడని హీరోయిన్ నిహారిక ఇంటి నుంచి పారిపోతుంది. దీంతో ఆమె ఫ్రెండ్స్ పడిన ఇబ్బందులే ఈ సినిమా ఫుల్ స్టోరీ. ఈ సినిమాలో ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణువుల కామెడీ అక్కడక్కడ మినహా చాలాచోట్ల అది యావరేజ్ గా అనిపిస్తుంది. మరోవైపు సత్య యాక్టింగ్ చాలా బెటర్ గా ఉంది. మధ్యలో బ్రహ్మానందం ఒక పాటలో మెరిసి వెళ్లిపోతారు. నవ్వించాలని సెటప్ చేసుకున్న కూడా ఈ సినిమాలో డైరెక్టర్ విజయేందర్ సక్సెస్ కాలేకపోయారు. ఓవరాల్ గా కథ స్క్రీన్ ప్లే, సాంగ్స్ అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ అవుట్ అవ్వలేదు.
మిత్ర మండలి సినిమా రేటింగ్ 2/5
Read also : డేటింగ్ చేస్తే ఆ హీరో తోనే… తేల్చి చెప్పిన అనసూయ..!