ఆంధ్ర ప్రదేశ్జాతీయంతెలంగాణ

తిరుమల దర్శనాల కోసం అడుక్కోవాల్సిన ఖర్మేంటి..? - టీటీడీపై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్‌

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు తీసుకునేందుకు టీటీడీ అంగీకరించింది. అయితే కొన్ని కండిషన్స్‌ పెట్టింది.

తిరుమల దర్శనాలపై తెలంగాణ ప్రజాప్రతిధులు అసంతృప్తితో ఉన్నారు. ప్రొటోకాల్‌ దర్శనాలు కల్పించడంలేదని.. సిఫార్సు లేఖలు తీసుకోవడం లేదని… కొంతకాలంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఈమధ్య మంత్రులు కూడా అసహనానికి గురయ్యారు. ఏపీ ముఖ్యమంత్రితో మాట్లాడతామని చెప్పారు. అయితే.. ఇటీవల సీఎం చంద్రబాబు అనుమతితో… తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు తీసుకునేందుకు టీటీడీ అంగీకరించింది. అయితే కొన్ని కండిషన్స్‌ పెట్టింది. వారంలో రెండు రోజులు అంటే… సోమవారం, మంగళవారం వీఐపీ బ్రేక్‌ దర్శనం… బుధవారం, గురువారం 300 రూపాలయ ప్రత్యేక దర్శనానికి మాత్రమే సిఫారసు లేఖలను అనుమతిస్తామని ప్రకటించింది. అంతేకాదు.. ఒక్కో ప్రతినిధికి సంబంధించి రోజుకు ఒక లేఖను మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. అయితే… తెలంగాణ నేతలు తమకు కూడా తిరుమల దర్శనాలు కల్పించాలని పదేపదే అడిగిన తర్వాత.. సీఎం చంద్రబాబు దీనిపై చర్చించారు. దీన్ని తాజాగా…. పాయింటౌట్‌ చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.

తిరుమలలో దర్శనాలు కల్పించాలని టీటీడీని అడ్డుక్కోవాలా అంటూ ఘాటుగా విమర్శించారు. అంత ఖర్మ తమకు ఏం పట్టిందని మండిపడ్డారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో జరిగిన ప్రజాపాలనలో కొలువుల పండగకు హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి… ఏపీ ప్రభుత్వం, టీటీడీ తీరుపై భగ్గుమన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు టీటీడీ ఉంటే… తెలంగాణకు వైటీడీ లేదా అని ప్రశ్నించారు. తిరుమల దర్శనాల కోసం ఏపీ ప్రభుత్వాన్ని, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రతీసారి అడుక్కోవడం ఏంటని..? అన్నారాయన. తెలంగాణలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం, భద్రాచలంలో రాముడు, రామప్పలో శివాలయాలు లేవా? అని ప్రశ్నించారు. తిరుమల దర్శనాల కోసం బతిమాలుకోవడం ఎందుకని.. తెలంగాణ ప్రజాప్రతినిధులకు కూడా హితవు పలికారు. తిరుమల వెళ్లే బదులు… తెలంగాణలోని ఆలయాలకు వెళ్లొచ్చుగా అని సూచించారాయన.

సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే… తిరుమల వెళ్లొద్దని తెలంగాణ ప్రజాప్రతినిధులకు చెప్పినట్టు ఉంది. మరి, ప్రజాప్రతినిధులు తిరుమల వెళ్లకుండా… తెలంగాణలోని ఆలయాలను సందర్శిస్తారా…! తెలంగాణ నేతలు సరే… సీఎం రేవంత్‌రెడ్డి విషయం ఏంటి…? ఆయన కూడా ఇక తిరుమల వెళ్లరా..? అనే అనుమానాలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి …

  1. జగన్‌కు ఏడుగురు ఎమ్మెల్యేల వెన్నుపోటు – రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారుగా…!

  2. రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం!..

  3. కాలం తెచ్చిన కరువు కాదు… పక్కా కాంగ్రెస్ తెచ్చిన కరువే.

  4. టీడీపీని తొక్కుకుంటూ పైకొస్తున్న జనసేన – తిరుపతి చంద్రబాబు పర్యటనే సాక్ష్యం

  5. 2029లో టీడీపీ అధికారంలో ఉండటం కష్టమేనా – చరిత్ర ఏం చెప్తోంది..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button