
క్రైమ్ మిర్రర్, పొలిటికల్ బ్యూరో :- ఏపీ బీజేపీకి కొత్త సారథి వచ్చేశారు. పురందేశ్వరి స్థానంలో మాధవ్‌ను కూర్చోబెట్టారు. మరి పురందేశ్వరి పరిస్థితి ఏంటి…? ఆమెకు ఏ బాధ్యతలు అప్పగించబోతున్నారు..? కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోబోతున్నారా..? లేక ఇంకేమైనా కీలక పదవులు అప్పజెప్పబోతున్నారా…? పురందేశ్వరి పొలిటికల్ ఫ్యూచర్.. వాట్ నెక్ట్స్.
ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కోసం చాలా మంది నేతలు పోటీ పడ్డారు. కానీ.. చివరికి ఆ పదవి మాధవ్‌కు దక్కింది. ఈ విషయంలో బీజేపీ అధిష్టానం వ్యూహాత్మకంగా ఆలోచించింది. ఎవరికీ ఇబ్బంది లేకుండా… పార్టీ నేతల మధ్య విభేదాలు రాకుండా.. జాగ్రత్తలు తీసుకుంది. విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, జీవీఎల్.. ఇలా దాదాపు 10 వరకు ఆశావహులు ఉన్నారు. కానీ.. ఆనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే మాధవ్‌ను ఎంపిక చేసింది కమలం పార్టీ. ఇందుతో భవిష్యత్ వ్యూహరచన ఉందని అంటున్నారు. ఆ వ్యూహం అంటుంచితే… ఎట్టకేలకు మాధవ్‌ను రాష్ట్రాధ్యక్షుడిని చేశారు.. మరి ఆ స్థానంలో ఉన్న పురందేశ్వరి పరిస్థితి ఏంటి..? ఆమెకు ఏ పదవి దక్కబోతోంది..? ఇదే ఇప్పటి హాట్‌హాట్ చర్చ.
ఎన్నికల ముందు పురందేశ్వరి తీరుపై ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్లాయి. కొందరు ఏపీ బీజేపీ నేతలు.. ఆమె తీరు పార్టీకి నష్టం కలిగించేలా ఉందని.. టీడీపీకి మేలు చేసేలా ఉందని ఫిర్యాదు చేశారు. దీంతో… పురందేశ్వరిని కొనసాగించడం సరికాదని… ఢిల్లీ పెద్దలు భావించారు. అందుకే.. మాధవ్‌కు పగ్గాలు అప్పగించారు. మరి పురందేశ్వరికి ఏ పదవి ఇస్తారంటే. ఆమెను పార్టీలో జాతీయ స్థాయిలో బాధ్యతలు అప్పగించే ఆలోచన ఉన్నట్టు సమాచారం. అంతేకాదు… లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవికి కూడా పురందేశ్వరి పేరు పరిశీలనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే… ఆమె ఫలానా పదవి ఇస్తారన్న అధికారిక సమాచారం ఏమీ లేదు. అసలు బీజేపీ అధిష్టానం ఏమనుకుంటుందో కూడా స్పష్టత లేదు. దీంతో.. పురందేశ్వరి రాజకీయ భవిష్యత్ ఏంటి…? ఆమె దక్కబోయే పదవి ఏంటి…? అన్న దానిపై ఏపీ బీజేపీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
వైసీపీ వీడారు – కూటమిలో కలవలేకపోతున్నారు- రెంటికీ చెడ్డ రేవడిలా…!