
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- ప్రస్తుత రోజుల్లో పిల్లలు కేవలం పుస్తకాలకే పరిమితమవుతున్నారు. నేడు సమాజంలో నెలకొన్న పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు సైతం పిల్లలకు కేవలం చదువే ముఖ్యమంటూ తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది విద్యార్థులు ఈ ఒత్తిడి కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న విషయం కూడా తెలిసిందే. నిత్యం ప్రతిరోజు కూడా సోషల్ మీడియాలోనూ లేదా వార్తలు లోనూ ఎవరో ఒకరు యువకులు ఒత్తిడి కారణంగా సూసైడ్ చేసుకుంటున్నారు. దానికి కారణం ఒకవైపు చదువు అయితే మరోవైపు తల్లిదండ్రులు కూడా కారణమే. నాలుగు లేదా ఐదు సంవత్సరాల నుంచి వారి చేతిలో పుస్తకాలు పెట్టి ఒత్తిడికి గురి చేస్తున్న పేరెంట్స్ కూడా చాలామంది ఉన్నారు.
Read also : తమిళ హీరో శివ కార్తికేయన్ కారుకు ప్రమాదం?
ఇకనైనా ఈ పరిస్థితి మారాలి అంటే పిల్లలకు చదువులతో పాటు ఎక్స్ట్రా కర్క్యులర్ యాక్టివిటీస్ కూడా నేర్పించాలి అని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. చదువు ముఖ్యమైనప్పటికీ చదువుతోపాటుగా క్రీడలు, సంగీతం అలాగే పెయింటింగ్ వంటివి నేర్పిస్తూ ఉంటే వారికి కాస్తయినా ఒత్తిడి తగ్గే అవకాశాలు ఉన్నాయి అని సూచిస్తున్నారు. ఒకవేళ ఎక్స్ట్రా యాక్టివిటీస్ నేర్పిస్తే చదువుకు దూరం అవుతారు అని వాటిని ఆపివేస్తే కచ్చితంగా ఒత్తిడికి గురువాల్సి వస్తుంది అని.. అప్పుడప్పుడు ఇలా సంగీతం లేదా క్రీడలు వంటి వాటి మీద ఆసక్తి చూపితేనే నేటి యువతలో ఒత్తిడి తగ్గుతుంది అని చెబుతున్నారు. ఎక్స్ట్రా ఆక్టివిటీస్ ద్వారా పిల్లల్లో క్రమశిక్షణ అలాగే ఓర్పు అనేవి పెరుగుతాయి అని అంతేకాకుండా మానసికంగా కూడా చాలా దృఢంగా తయారవుతారు అని నిపుణులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.
Read also : అభివృద్ధికి అడ్డుపడిన వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు : సీఎం చంద్రబాబు





