
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- స్మితా సబర్వాల్.. ఈమె తెలంగాణకు చెందిన సీరియర్ ఐఏఎస్ (IAS) అధికారి. ఆమె ఆనారోగ్యం బారిన పడ్డారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అమెకు ఒక అరుదైన వ్యాధి వచ్చింది. దాని పేరు వెర్టిబ్రల్ అర్టరీ డిసెక్షన్. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. కొన్ని నెలల క్రితం ఈ వ్యాధి బారిన పడ్డానని… నెమ్మదిగా కోలుకుంటున్నానని చెప్పారామె. ఈ సమయం చాలా నెమ్మదిగా గడుస్తోందని కూడా ట్వీట్ చేశారు. ఇది చాలా నొప్పితో కూడుకున్నదని… ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నట్టు చెప్పారామె.
Read also : ప్రజలకు అసౌకర్యం లేకుండా నిమజ్జనాలు జరగాలి!
వెర్టిబ్రల్ అర్టరీ డిసెక్షన్ అంటే ఏంటి…? దీని వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలేంటి…? వెర్టిబ్రల్ అర్టరీ డిసెక్షన్ అంటే… వెన్నుపూస ధమని విచ్ఛేదనం. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ముఖ్యమైన రక్తనాళం గోడలో పగుళ్లు ఏర్పడటం. వెన్నుపూస ధమని మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ముఖ్యమైన రక్తనాళం. చీలిక తర్వాత… రక్తం ధమని గోడలోకి ప్రవేశించి రక్తం గడ్డకడుతుంది. దీని వల్ల ధమని గోడ మందంగా మారుతుంది. తరచూ రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. వెర్టిబ్రల్ అర్టరీ డిసెక్షన్‌లో.. తల, మెడ నొప్పి ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు మాట్లాడటంలో ఇబ్బంది ఏర్పడుతుంది. సమన్వయ లోపం, దృష్టి నష్టం కూడా కలుగుతుంది. శాశ్వత స్ట్రోక్ లక్షణాలు కూడా ఉంటాయి. ఈ వ్యాధితోనే స్మిత సబర్వాల్ బాధపడుతున్నట్టు సమాచారం. ఈ వ్యాధి రావడానికి అనేక కారణలు ఉంటాయి. ఏదైనా ప్రమాదంలో మెదడుగు గాయమైతే.. ఈ సమస్య ఏర్పడవచ్చు. హైబీపీ వల్ల కూడా రావొచ్చు. ర్తనాళాల బలహీనత వల్ల కూడా ఈ వ్యాధి బారిన పడొచ్చు. ఈ వ్యాధికి చికిత్స ఉంది. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే కోలుకుంటారు. కాకపోతే.. కొంత సమయం పడుతుంది. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే.. బెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెప్తున్నారు.
Read also : సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు
స్మితా సబర్వాల్ ఈ వ్యాధితోనే బాధపడుతున్నారు. చికిత్స తీసుకుంటూ.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. చికిత్స కోసం లాంగ్ లీవ్ పెట్టుకున్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 31 వరకు ఆమెకు లీవ్ మంజూరు చేసింది ప్రభుత్వం. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా ఉన్న ఆమె స్థానంలో… IAS కాత్యాయనీ దేవికి ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.