
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ప్రస్తుత రోజుల్లో చాలామంది యువకులకు రాగి జావ అంటే ఏంటో తెలియదు. కానీ ఆ రోజుల్లో రాగి జావా అంటే తెలియని వారు ఉండరు. ఈ రాగి జావా అనేది మానవ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. బహుశా అప్పటి కాలంలో ఈ రాగి జావ తాగడం వల్లనే నేటికీ కూడా మన తల్లిదండ్రులు లేదా మన తాత, అవ్వలు దగ్గర దగ్గరగా 100 సంవత్సరాలు వరకు జీవించగలుగుతున్నారు. కానీ నేటి యుగంలో దాదాపు 70 సంవత్సరాలు వస్తే ఇక అనారోగ్య సమస్యలతో పైకి పోవాల్సిందే. కాబట్టి రాగి జావతో మన శరీరానికి చాలానే ఫలితాలు, లాభాలు ఉన్నాయి.
Read also : బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్.. అఖండ -2 ఓటీటీ ఆ తేదీనే?
రాగి జావ తో శరీరానికి లాభాలు:-
1.రాగి జావా మానవ శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తూ ఉంటుంది.
2. మానవుని జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో, కడుపు సమస్యలను తగ్గించడంలో రాగిజావ ఎంతగానో సహాయపడుతుంది.
3. మానవుని ఎముకలు అలాగే దంతాలను రాగి జావ చాలా బలంగా ఉంచేలా చేస్తుంది
4. అధికంగా ఆకలి అయ్యేటువంటి ప్రభావాన్ని తగ్గిస్తుంది.
5. రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిని నియంత్రించడంలో రాగి జావా చాలా బాగా సహాయపడుతుంది.
కొన్ని వేడి నీటిలో రాగి పిండి వేసి కలిపితే చాలు జావ అనేది రెడీ అవుతుంది. ఈ జావాలో కొంచెం మజ్జిగ కలుపుకొని తాగితే మరింత టేస్టీగా ఉంటుంది. దీనిని పిల్లలు లేక పెద్దలు ఎవరైనా సరే తాగవచ్చు.
Read also : ఈ ఏడాది వరల్డ్ కప్ మ్యాచ్ ల తో ఫ్యాన్స్ కు పండుగే?





