
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- పరకామణిలో చోరీ జరిగిన విషయం రాష్ట్రవ్యాప్తంగా వైరల్ గా మారింది. అయితే ఈ చోరీ పై తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. పరకామణిలో జరిగింది చాలా చిన్న చోరీ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి సొమ్మును దొంగలిస్తే అది చిన్న చోరీతో పోల్చుతున్నావా జగన్ అంటూ మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల కోట్ల జనం సొమ్ము దోచుకున్న మీకు ఆ వెంకన్న స్వామి హుండీ దోపిడీ చిన్న చోరీలా కనిపిస్తుందా?.. అని ఒక వీడియోని షేర్ చేస్తూ ప్రశ్నించారు. “ఇది మహా పాపం జగన్ గారు” అంటూ రాసుకొచ్చారు. ఎంతోమంది భక్తులు తమ డబ్బును వెంకన్న స్వామికి కానుకగా హుండీలో వేస్తే అటువంటి పవిత్రమైన కానుకలను హుండీల నుంచి నేరుగా చోరీ చేస్తే అది చిన్న చోరీ కింద జగన్ పరిగణిస్తున్నారు అని… అసలు అలా ఎలా చెప్పగలుగుతున్నారు అని లోకేష్ మండిపడ్డారు. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి కానుకలను దొంగలించినటువంటి దొంగ కూడా మంచివాడు అంటూ జగన్ చెబుతున్నాడు అని తెలుగుదేశం పార్టీ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది. ఏది ఏమైనా కూడా ఆ వెంకటేశ్వర స్వామి కానుకలను దొంగలించడం అనేది మహా పాపం… ఈ పరకామణి చోరీ అనేది రాష్ట్రవ్యాప్తంగా ఇపుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.
Read also : మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వండి.. తెలుగు వస్తేనే ఉద్యోగం ఇవ్వండి : మాజీ ఉపరాష్ట్రపతి
Read also : బిగ్ బ్రేకింగ్ న్యూస్.. బాలకృష్ణ సినిమా వాయిదా?




