నేపాల్ దేశంలో వర్షం కుమ్మేస్తోంది. గత మూడు రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది. నేపాల్ రాజధాని ఖాట్మండులో వర్ అత్యంత భారీగా కురడడంతో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. నగరంలోని సగం ప్రాంతాలు జలమలమయ్యాయి. భారీ వరదల కారణంగా కొండచరియలు విరిగిపడిన పడుతున్నాయి. రోడ్లు కొట్టుకుపోతున్నాయి. వంతెనలు కుప్పకూలిపోతున్నాయి. రోడ్లపై ప్రయాణించే బస్సులు, ఇతర వాహనాల ప్రమాదాలకు గురయ్యాయి.
వరద సహాయక చర్యలు కష్టంగా మారాయి. ఎక్కడికక్కడ మృతదేహాలు బయటపడుతున్నాయి. వరదల కారణంగా మరణించిన వారి ప్రభుత్వ లెక్కల ప్రకారం 150 దాటింది. కాని వేలాది మంది చనిపోయి ఉంటారనే వార్తలు వస్తున్నాయి. అడ్రస్ దొరకడం లేదంటూ వందలాది ఫిర్యాదులు అధికారులకు వస్తున్నాయి. మిస్సైన వాళ్లంతా వరదల్లో గల్లంతు అయ్యారనే అనుమానాలు వస్తున్నాయి. గల్లంతు అయిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఖాట్మండుకు వచ్చే మూడు మార్గాల్లోనూ జాతీయ రహదారులపై కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వరదల్లో పలు వంతెనలు కొట్టుకుపోయాయి. నేపాల్‌లోని భయానక పరిస్థితుల వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనేక బ్రిడ్జ్ లు కూలి పోయి వరద ఉదృతిలో కొట్టుకుపోతున్నాయి.
ఇవి కూడా చదవండి …
Raja Singh Lodh : రోడ్డెక్కిన ఎమ్మెల్యే రాజా సింగ్.. పాతబస్తీలో హై టెన్షన్
Teenmar Mallanna : రేవంత్‌పై తీన్మార్ మల్లన్న తిరుగుబాటు.. ఆయన వెనకున్నదెవరు?
K.T. RAMARAO : బామ్మర్ది లీగల్ నోటీస్ ఇస్తే భయపడిపోతానా!
JAGGAREDDY : నేను ఓకే అంటేనే ఇండ్లు కూల్చేయండి..హైడ్రాకు జగ్గారెడ్డి వార్నింగ్