
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఇటీవల ఉమెన్స్ వరల్డ్ కప్ లో భారత జట్టు ఘన విజయం సాధించిన విషయం ప్రతి ఒకరికి తెలిసిందే. అయితే ఆ తరువాత జట్టులోని మహిళలందరికీ కూడా దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. ఆయా రాష్ట్రాలకు చెందిన మహిళలు ఆ జట్టులో ఉంటే.. వారికి ప్రభుత్వం తరఫున ఉద్యోగం అలాగే భారీ నగదు కూడా బహుమానంగా లభించాయి. మరోవైపు కొంతమంది వ్యాపారవేత్తలు కూడా వారికి కార్సు అలాగే డైమండ్స్ గిఫ్ట్ గా ఇచ్చారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రీచరణి గ్రూపు 1 జాబుతో పాటు 2.5 కోట్ల ప్రైస్ మనీ అలాగే ఇంటి స్థలం ఇచ్చిన విషయం దాదాపు అందరికీ తెలుసు. అయితే తాజాగా వరల్డ్ కప్ విన్నర్ రిచా ఘోష్ కు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం అద్భుతమైన గౌరవం ఇచ్చింది. వెస్ట్ బెంగాల్ లో నిర్మిస్తున్న స్టేడియానికి ఆమె పేరు పెట్టాలి అని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 27 ఎకరాల్లో నిర్మించబోయే స్టేడియానికి రిచా అనే పేరు పెడితే భవిష్యత్ తరాలకు ప్రేరణగా ఉంటుంది అని అన్నారు. రిచా ఘోష్ కు ఇటీవల వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం డిఎస్పీగా ఉద్యోగం కూడా కల్పించింది. దాంతోపాటుగా నూతనంగా నిర్మించే స్టేడియానికి ఈమె పేరునే పెట్టాలని భావిస్తుంది.
Read also : పోలింగ్ వేల కాంగ్రెస్ నేతలు జూబ్లీహిల్స్ లో పర్యటించడంపై ఈసీ సీరియస్?
Read also : రైతులకు శుభవార్త త్వరలో ఖాతాల్లోకి డబ్బులు జమ





