
మునుగోడు,క్రైమ్ మిర్రర్:- చిద్రమైన ఆర్థిక వ్యవస్థను ఓ వైపు చక్క దిద్దుతూనే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే నిర్వహించేందుకు సన్నహాలు ఊపందుకున్న నేపథ్యంలో రిజర్వేషన్లు ఖరారు స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రక్రియపై నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి పాజిటివ్ గా తీసుకెళ్లాలన్నారు. ఇందిరమ్మ ఇల్లుల మంజూరులో నెలకొన్న ఇబ్బందులు అధిగమించడానికి నిబంధనల సడలింపుపై ప్రభుత్వంతో మాట్లాడి నిజమయిన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.పాల్వాయి చెన్నారెడ్డి,బూడిద లింగయ్య యాదవ్,వేమిరెడ్డి జితేందర్ రెడ్డి,జాల వెంకన్న,పాల్వాయి జితేందర్ రెడ్డి,ఆరేళ్ల సైదులు,పందుల భాస్కర్,జంగిలి నాగరాజు,వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.
Read also : అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టిన ఎమ్మెల్యేలు.. సీరియస్ అయిన సీఎం?
Read also : కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి అతడు ఒక సైన్యం